తొలిసారి ఆ జోనర్‌లో: మహేశ్ - రాజమౌళి సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అదే సమయంలో ఎన్నో రికార్డులు సైతం తమ పేరిట లిఖించుకున్నారు. అయితే, చాలా తక్కువ మంది మాత్రమే వంద శాతం సక్సెస్ రేట్ సాధించారు. అలాంటి వారిలో దర్శకధీరుడు రాజమౌళి ఒకరు. చాలా కాలంగా టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా వెలుగొందుతోన్న ఆయన భారీ సినిమాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. తాజాగా దాని తాలుకూ పనిని కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాజమౌళి - మహేశ్ మూవీ ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. ఆ సంగతులు మీకోసం.!

‘స్టూడెంట్ నెం 1’తో నెంబర్ వన్ అయిపోయాడు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వంలో శిక్షణ తీసుకున్న ఎస్ ఎస్ రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెం 1' సినిమాతో డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ‘సింహాద్రి', ‘సై', ‘ఛత్రపతి', ‘విక్రమార్కుడు', ‘యమదొంగ', ‘మగధీర', ‘మర్యాద రామన్న', ‘ఈగ' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని టాప్ డైరెక్టర్ అయిపోయాడు.

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేశాడు
అప్పటి వరకు ఓ రేంజ్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన రాజమౌళి... ప్రభాస్ హీరోగా ‘బాహుబలి' అనే భారీ సినిమాను తెరకెక్కించాడు. రెండు భాగాలుగా విడుదలైన ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశారు. ఈ రెండు భాగాలూ సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించాయి. దీంతో తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం అయిపోయింది.

మరో భారీ ప్రాజెక్ట్.. ఈ సారి మల్టీస్టారర్ మూవీగా
‘బాహుబలి' వంటి భారీ విజయం తర్వాత దర్శకధీరుడు తెరకెక్కిస్తోన్న చిత్రం ‘RRR'. ‘రౌద్రం రణం రుధిరం' అనే క్యాప్షన్‌తో రాబోతున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో చెర్రీ.. అల్లూరిగా, తారక్.. భీంగా నటిస్తున్నారు. ఈ మూవీ జనవరి 8, 2021న విడుదల కానుంది.

ఒకే ఒక్క వీడియోతో సత్తా చూపించిన జక్కన్న
ఈ సినిమా ప్రారంభమై ఏడాదిన్నర పైగానే అవుతున్నప్పటికీ.. షూటింగ్ మాత్రం ఎనభై శాతం మాత్రమే పూర్తయింది. దీంతో ఈ సినిమా మొదట ప్రకటించిన తేదీన కాకుండా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల రామ్ చరణ్ లుక్‌కు సంబంధించిన వీడియో విడుదల చేశారు. దానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచేశారు.

మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటన
లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటోన్న రాజమౌళి.. ఇటీవల ఓ న్యూస్ చానెల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు పంచుకున్నారు. అలాగే, RRR తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు జక్కన్న. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తారని తెలిపారు. దీంతో ఈ మూవీపై అప్పుడే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి.

సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది.!
మహేశ్ బాబుతో చేయబోయే సినిమాకు సంబంధించిన కథను తన తండ్రి విజయేంద్రప్రసాద్ రాస్తారని రాజమౌళి తెలిపారు. తాజా సమాచారం ప్రకారం... ఆయన దగ్గర ఉన్న వాటిలో ఓ స్టోరీ లైన్‌ను ఎంపిక చేశాడట జక్కన్న. దీంతో విజయేంద్రప్రసాద్ దానిపై స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రారంభించారని తెలిసింది. రాజమౌళి ఎంపిక చేసింది థ్రిల్లర్‌గా సాగే కమర్షియల్ కథ అని ప్రచారం సాగుతోంది.
Recommended Video

తొలిసారి ఆ జోనర్‌ను ట్రై చేస్తున్న రాజమౌళి
RRRతో కలిపి రాజమౌళి ఇప్పటి వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో కమర్షియల్, సోషల్, సోషియే ఫాంటసీ, క్రైమ్, కామెడీ సహా ఎన్నో జోనర్ల సినిమాలు ఉన్నాయి. అయితే, మహేశ్‌తో చేయబోయే సినిమా మాత్రం ఇప్పటి వరకు చేయని థ్రిల్లర్ జోనర్‌ది అని అంటున్నారు. ఇదే నిజమైతే మహేశ్ బాబు అభిమానులతో పాటు సినీ ప్రియులకు పండగే అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











