రాజమౌళి మూవీ.. బడ్జెట్ డోస్ మామూలుగా లేదు.. మహేష్ బాబుకు ఇదే సరైన ఛాన్స్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త కాంబినేషన్స్ సెట్టవుతున్నాయి. చూస్తుంటే భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమాలు అనగానే మొదట టాలీవుడ్ గుర్తొచ్చేలా ఉంది. దర్శకుడు రాజమౌళి ఆ రేంజ్ లో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు మరి. నెక్స్ట్ ఈ స్టార్ డైరెక్టర్ RRR సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత చేయనున్న ప్రాజెక్టు పై అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి.

మగధీర తరువాతే అనుకున్నారు..
మహేష్ బాబు ఎప్పటి నుంచో డైరెక్టర్ రాజమౌళితో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మగధీర సినిమా తరువాత నుంచి కూడా మహేష్ బాబుతో ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేయాలని రాజమౌళి చర్చలు జరుపుతూనే ఉన్నాడు. కానీ సరైన కథ సెట్టవ్వకపోవడం వలన ఇన్నాళ్లు వేయిట్ చేయాల్సి వచ్చింది.

ఫుల్ స్క్రిప్ట్ రెడీ..
ఇక మొత్తానికి రచయిత కె.విజయేంద్రప్రసాద్ రాజమౌళి విజన్ కు తగ్గట్లు అద్భుతమైన కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి లాక్ డౌన్ లోనే ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేయించాడు. ఆ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎలాగైనా సినిమాను వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

హాలీవుడ్ రేంజ్ లో..
ఇక సినిమా ఎలా ఉంటుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బడ్జెట్ అయితే సుమారు 200కోట్లు తప్పకుండా ఉంటుందని సమాచారం. ఇంతవరకు మహేష్ బాబు కెరీర్ లో ఆ స్థాయిలో సినిమాను రూపొందించలేదు. ఇక రాజమౌళి టచ్ చేయని స్పై థ్రిల్లర్ డ్రామాను మహేష్ తో టచ్ చేశాడట. తనదైన శైలిలో మహేష్ ను హాలీవుడ్ రేంజ్ లో చూపిస్తాడాని అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు.
Recommended Video

మహేష్ బాబుకు ఇదే మంచి అవకాశం
రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా సినిమా మాత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే తెరకెక్కుతోంది. సీనియర్ నిర్మాత KL. నారాయణ ఈ సినిమాను 200కోట్లతో నిర్మించడానికి రెడీగా ఉన్నారు. ఎలాగూ RRR హిందీ తమిళ్ భాషల్లో హిట్టవ్వడం కాయం. దీంతో దర్శకుడి కారణంగా మహేష్ కు రెండు ఇండస్ట్రీల మార్కెట్ పై పట్టు సాధించే అవకాశం దొరుకుతుంది. గతంలో స్పైడర్ ద్వారా కోలీవుడ్ మార్కెట్ సెట్ చేసుకోవాలని అనుకున్నారు కానీ అది బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ సారి రాజమౌళితో మహేష్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











