గెస్ట్ రోల్ లో రాజమౌళి...వివరాలు
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి త్వరలో తెరపై ఓ పాత్రలో కనిపించనున్నాడు. అవుననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. ఆయన మరో దర్శకుడు వీర శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన కుర్రాళ్ళే' (ది లేటెస్ట్ జనరేషన్) చిత్రంలో గెస్ట్ గా చేయనున్నారని తెలుస్తోంది. సీన్ ప్రకారం... ఆయన ఓ ఆడియో పంక్షన్ కి హాజరవుతారు. అది సినిమాలో మెయిన్ లీడ్ ...హీరోగా మారిన చేస్తున్న ఆడియో పంక్షన్.
ఈ షాట్ కోసం ఆయన రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం మూడు గంటలు దాకా షూటింగ్ కు హాజరయ్యారు. సినిమాలో ఈ సీన్ కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. గతంలోనూ రాజమౌళి..రయిన్ బో చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే.

‘మన కుర్రాళ్ళే' చిత్రం వివరాల్లోకి వెళితే..
అరవింద్ కృష్ణ, రాజ్‌కళ్యాణ్, ప్రగతి ప్రధాన పాత్రధారులుగా వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై బి.వి.ఎస్.శ్రీనివాస్, హారూన్.హెచ్.ఎస్. రూపొందించిన చిత్రం ‘మన కుర్రాళ్ళే' (ది లేటెస్ట్ జనరేషన్). వీరశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్‌వారు క్లీన్ యు సర్ట్ఫికెట్ ఇచ్చారు.
దర్శకుడు మాట్లాడుతూ- సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అనేక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, అనివార్య కారణాలవల్ల తానే నిర్మాతగా మారాల్సి వచ్చిందని, తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. వచ్చే నెల తొలివారాలలో సినిమా విడుదల చేస్తామని, పట్నంలో పనిచేసే కొంతమంది కుర్రాళ్ళు తమ గ్రామానికి ఏర్పడిన సమస్యను ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని తెలిపారు.
కృష్ణుడు, వెంకట్, రావూ రమేష్, కృష్ణ్భగవాన్, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, శ్రీనివాసరెడ్డి, సమ్మెట గాంధి, శృతిరాజ్, బెంగుళూరు పద్మ, రచన తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ముజీర్ మాలిక్, సంగీతం: రాజ్, గురుకిరణ్, మనోమూర్తి, జి.కె, శివకాకాని, మురహరి జైన్, భీమ్స్.


Click it and Unblock the Notifications











