రాజమౌళి సునీల్ తో సినిమా తీయడానికి మెయిన్ రీజన్ అదా...!?
సునీల్ ను సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టిన 'మర్యాదరామన్న" చిత్రం రూపొందడం వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ చిత్రంలో సునీల్ హీరో అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. కామెంట్స్ చేశారుకూడా. సినిమా పెద్ద హిట్ కావడంతో అందరూ నోరు మూసుకున్నారు. అయితే ఈ సినిమాలో సునీల్ నే హీరోగా పెట్టుకోవడానికి స్ట్రాంగ్ రీజన్ వుంది.
'మగధీర" గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత జరిగిన ఒక పార్టీలో ఒక వ్యక్తి 'జూ ఎన్టీఆర్" రామ్ చరణ్ తేజ్, రవితేజ, ప్రభాస్ వంటి పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యడంవల్లే రాజమౌళి అంత సక్సెస్ అయ్యాడు" అన్నాడు. దానికి బాగా హర్ట్ అయిన రాజమౌళి తను నెక్స్ ట్ చెయ్యబోయే సినిమా ఎలాంటి ఇమేజ్ లేని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో చెయ్యాలని డిసైడ్ చేసుకున్నాడు. ఆ విధంగా సునీల్ రాజమౌళి సినిమాలో హీరో అయ్యాడు. సునీల్ హీరోగా మంచి పేరు తెచ్చుకోవడానికి ఒక విధంగా రామ్ చరణ్ కూడా కారణమని దీన్నిబట్టి అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











