రాజమౌళి 'మర్యాద రామన్న' స్టోరీ లైన్ ఇదేనా
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో హాస్య నటుడు సునీల్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మర్యాద రామన్న'. సలోని హీరోయిన్ గా చేసే ఈ చిత్రం జూన్ నెలలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ఇటీవలే కరీంనగర్ లో చిత్రీకరణ జరుపుకుంది. అలాగే మగధీర చిత్రం తర్వాత రాజమౌళి డైరక్ట్ చేస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కామిడీగా జరుగుతుందని తెలుస్తోంది. కథలో ఎక్కువ భాగం ఓ ఇంటిలో జరుగుతుందని, మర్యాదలకు ఎక్కువ విలవనిచ్చే రాయలసీమ నేఫద్యంలో ఈ చిత్రం జరగనుంది. కథ ప్రకారం అమెరికాలో ఉండి వచ్చిన సునీల్ తన ఊళ్లో ప్యాక్షన్ హత్యలు లేకుండా చేయాలని ప్రత్యర్ధి ఇంటికెళ్ళి ఇరుక్కుంటాడు. అక్కడ మర్యాదలు ప్రకారం ఇంటికొచ్చిన అతిధిని ఏమీ చేయకూడదు. అలా ఇంటిలోకి వచ్చి పడిన వాడిని బయిటకు గెంటాలని ఆ ప్రత్యర్ధుల ఫ్యామిలీ ప్లాన్ చేస్తూంటుంది. గుమ్మం దాటితే తల తెగుతుందని సునీల్ అక్కడే ఉండి వారిలో ఎలా మార్పు తెస్తాడన్నది కథ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











