»   » రాజమౌళి నెక్ట్స్ మల్టి స్టారరా..అదీ ఆ హీరోలతో?

రాజమౌళి నెక్ట్స్ మల్టి స్టారరా..అదీ ఆ హీరోలతో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాహుబలి అనంతరం రాజమౌళి ఏ చిత్రం చేస్తారు..ఏ హీరోతో చేస్తారు అనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. కొందరు ఇప్పటికే మహేష్ తో ఖరారు చేసుకున్నాడు కాబట్టి అతనితోనే చేస్తాడని అంటున్నారు. అయితే రాజమౌళి తండ్రి విజియోంద్రప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం వేరే విధంగా ఉంది.

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో విజియేంద్రప్రసాద్ మాట్లాడుతూ... రాజమౌళి తనను ఓ రియలిస్టిక్ స్క్రిప్టు అదీ సోషల్ మెసేజ్ తో కూడినది చేయమని అడిగారని చెప్పారు. ఆ స్క్రిప్టు అల్లు అర్జున్, తమిళ స్టార్ హీరో అజిత్ కోసమని అన్నారని చెప్పారు. వీరిద్దరితో మల్టి స్టారర్ చెయ్యాలనే రాజమౌళి అడిగినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో కథ మీద చర్చలు జరుగుతన్నట్లు చెప్పారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Rajamouli next a multi starrer ?

ఇక బాహుబలి @ 500 కోట్లు

అందరూ అంచనా వేసినట్లుగానే.. 'బాహుబలి'ఐదొందల కోట్ల క్లబ్‌లో చేరింది. గత నెల 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.500 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. దీంతో పాటు బాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తెలుగు సినిమాగా 'బాహుబలి' నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో కొనసాగుతున్న 'బాహుబలి' జైత్రయాత్రలో మరో మైలురాయిని అధిగమించింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ బాలీవుడ్‌ బాక్సాఫీసు వంద కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించింది. ఆదివారం నాటికి రూ. 103.51 కోట్లు వసూలు చేసింది.

బాలీవుడ్‌.. 'బాహుబలి'.. రూ.100కోట్లు..

Rajamouli next a multi starrer ?

'బాహుబలి' చిత్ర రికార్డుల పర్వం కొనసాగుతోంది. విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్‌లలో సరికొత్త రికార్డులను సృష్టించింది. బాలీవుడ్‌లో రూ.100 కోట్ల వసూళ్లు దాటిన ఏకైక డబ్బింగ్‌ చిత్రంగా 'బాహుబలి' నిలిచింది.

గత ఆదివారంతో ముగిసిన నాలుగో వారం కలెక్షన్‌లతో 'బాహుబలి' రూ.103.51 కోట్లకు చేరిందని బాలీవుడ్‌ సినీ ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. చిత్రాన్ని హిందీలో సమర్పించిన ధర్మా ప్రొడక్షన్స్‌ సంస్థ అధినేత నిర్మాత కరణ్‌ జోహార్‌ దర్శకులు రాజమౌళిని ప్రత్యేకంగా అభినందించారు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ చిత్రం 'బజరంగీ భాయ్‌జాన్‌' థియేటర్లలో ఉన్నా.. 'బాహుబలి'కి కలెక్షన్‌లు తగ్గక పోవడం గమనార్హం.

మరో ప్రక్క...

'బాహుబలి' బ్రాండ్‌ విలువని పెంచేందుకు, చిన్న పిల్లల్లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచేందుకు ఇప్పుడు 'బాహుబలి' బొమ్మల్ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. ఎనిమిది ప్రధాన పాత్రల చుట్టూ నడిచే చిత్రమిది.

Rajamouli next a multi starrer ?

'బాహుబలి', 'భళ్లాలదేవ', 'దేవసేన', 'శివగామి', 'అవంతిక'.. ఇలా ఒకొక్క పాత్రకూ ఒక్కో విశిష్టత ఉంది. ఆపాత్రల్ని పోలిన బొమ్మల్ని రూపొందించి, త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.

వాటితోపాటు 'బాహుబలి' వీడియో గేమ్స్‌నీ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని అంతర్జాతీయ సంస్థలతో 'బాహుబలి' చిత్రం యూనిట్ చర్చలు జరుపుతోంది. హాలీవుడ్‌లో 'స్పైడర్‌మేన్‌', 'సూపర్‌మేన్‌' సిరీస్‌ సినిమాలు విడుదల చేసే సమయంలో ఆ పాత్రల్ని పోలిన బొమ్మలు, వీడియో గేమ్స్‌, కొన్ని వినియోగ వస్తువులు మార్కెట్‌లో విడుదల చేస్తుంటారు.

అటు ప్రచారం, ఇటు వ్యాపారం రెండూ జరిగిపోతుంటాయి. అదే వ్యూహాన్ని 'బాహుబలి' కోసం అనుసరిస్తున్నారు రాజమౌళి. వచ్చే ఏడాది జనవరిలోగా ఈ బొమ్మలు మార్కెట్‌లోకి వస్తాయి.

English summary
Vijayendra Prasad shares Rajamouli has asked him to work on a realistic script with social message to cast Tamil star Ajith and Stylish Star Allu Arjun in this multi-starrer. He also conveyed that discussion were held with the stars on materializing the combo.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu