రాజమౌళి నెక్ట్స్ చిత్రం టైటిల్ 'ఈగ'..డిటేల్స్
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన తదుపరి చిత్రానికి 'ఈగ' అనే టైటిల్ పెట్టనున్నారని సమచారం. అలాగే ఆ చిత్రంలో హీరో ఉండరని ఎగిరే ఈగ ప్రధాన పాత్ర వహిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు గత కొంతకాలంగా స్క్రిప్టు వర్క్ నడుస్తోంది. గ్రాఫిక్స్ తో కూడిన ఓ ప్రయోగాత్మక చిత్రంగా ఈ 'ఈగ' ని తీర్చిదిద్దాలని రాజమౌళి భావిస్తున్నారు. హాలీవుడ్ లో తేనెటీగ ప్రధానపాత్రలో వచ్చి హిట్టయిన బీ మూవీ (2007) తరహాలో ఈ చిత్రం ఉండబోతోంది. అయితే 'ఈగ' మాత్రమే గ్రాఫిక్స్ అనీ మిగతా పాత్రల్లో మనుష్యులు ఉండనున్నారు. కథ మొత్తం 'ఈగ' పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది.
ఇక మొదటి నుంచి అడపా దడపా చిత్రాల్లో గ్రాఫిక్స్ ని వాడుతున్నా పూర్తి స్ధాయిలో గ్రాఫిక్స్ ఉపయోగించిన మగధీర సంచలన విజయం సాధించటంతో గ్రాఫిక్స్ పై మరింత మక్కువ పెంచుకుని రాజమౌళి ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మర్యాద రామన్న హిట్ పై ఈ చిత్రం ప్రారంభం ఆధారపడి ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. సునీల్ తో చేస్తున్న ఈ కామిడీ ఎక్సపరమెంట్ కొంచెం అటూ ఇటూ అయితే మళ్లీ రెగ్యులర్ స్కీమ్ లోకి రాజమౌళి వెళ్ళి చేస్తాడని చెప్తున్నారు. ఏదైమైనా మర్యాద రామన్న మంచి హిట్ అయి తెలుగువారి మర్యాదని నిలపే మరిన్ని ప్రయోగాత్మక కమర్షియల్ చిత్రాలు రాజమౌళి చేయాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











