»   » రాజమౌళి పోస్టు వెనక అర్ధాలెన్నో? నెక్ట్స్ మూవీ క్లూ ఇచ్చాడు!

రాజమౌళి పోస్టు వెనక అర్ధాలెన్నో? నెక్ట్స్ మూవీ క్లూ ఇచ్చాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి' సినిమాతో దర్శకుడు రాజమౌళి జాతీయ స్థాయి దర్శకుడయ్యాడు. 'బాహుబలి' తర్వాత ఆయన మరిన్ని భారీ ప్రాజెక్టులు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల నేషనల్ అవార్డు అందుకునే సందర్భంలో తన తర్వాతి సినిమాల గురించి మనసులోని మాట బయట పెట్టారు.

మా తాత చిన్న తనంలో చెప్పిన కథలతో నేను ఎంతో ఇన్‌స్పైర్ అయ్యాను. ఆయన చెప్పిక కథలన్నీ భారతీయ చరిత్ర, గొప్పదనం గురించే. ఇండియాకు సంబంధించిన ఎన్నో స్టోరీలను తెరకెక్కించాలని ఉంది. అశోకుడు, అక్బర్, మహారాణా ప్రతాప్ లాంటి వారి కథలను చేయాలనే కోరిక ఉంది అని రాజమౌళి తెలిపారు.

Rajamouli next movie on Maharana Pratap?

రాజమౌళి నోటి నుండి ఆ మాటలు ఊరికే రాలేని తాజాగా ఆయన ఫేస్ బుక్ లో చేసిన పోస్టుతో తేటతెల్లం అయింది. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఆయన గురించిన ఓ పోస్టర్ షేర్ చేసారు రాజమౌళి. భారతదేశ చరిత్రలో గ్రేట్ వారియర్ గా పేర్కొన్నారు.

రాజమౌళి చేసిన ఈ పోస్టు వెనక ఎన్నో అర్థాలు ఉన్నాయని, మహారాణా ప్రతాప్ స్టోరీతో రాజమౌళి సినిమా చేసే అవకాశం ఉంది కాబట్టే ఈ పోస్టు చేసాడని..... రాజమౌళి తన తర్వాతి సినిమా గురించి ఈ విధంగా క్లూ ఇచ్చారని అంటున్నారు సినీ జనాలు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి పార్ట్-2 పనులు శరవేగంగా సాగుతున్నాయి. 'బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో రాబోతున్న ఈ చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
"Remembering one the greatest warriors of Indian history, Maharana Pratap on his birth anniversary" Rajamouli posted on FB.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu