అసంతృప్తిగా ఉన్న రాజమౌళి.. వెంటనే ఇలా చేయాలని ఫిక్సయ్యారట!
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో ఆయన సృష్టించిన హంగామా.. తెలుగు సినీ చరిత్రలోనే మరే సినిమా సృష్టించలేదు. ఇదీ తెలుగోడి సత్తా అని ఎల్లలు దాటి వినిపించేలా చేసిన జక్కన్న.. తన తదుపరి ప్రాజెక్టు విషయంలోనూ అంతే శ్రద్ద తీసుకుంటున్నారు. బాహుబలి స్థాయిలో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయిన ఆయన RRR సినిమా రూపొందిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరూ సెట్స్ పై చురుకుగా కదులుతున్నారు. అయితే తాజా ఈ చిత్ర షూట్ విషయమై డైరెక్టర్ రాజమౌళి కాస్త అసంతృప్తిగా ఉన్నారనే టాక్ బయటకు వచ్చింది. కొన్ని సీన్స్ తాను అనుకున్న రేంజ్‌లో రాని కారణంగా రాజమౌళి ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

ఈ మేరకు సదరు సీన్స్ రీ షూట్ చేయాలని జక్కన్న భావిస్తున్నాడనేది లేటెస్ట్ సమాచారం. RRR అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'రామ రౌద్ర రుషితం' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారని తెలిసింది. భారీ బడ్జెట్ కేటాయించి ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ చరణ్ నటిస్తుండగా, కొమురం భీం రోల్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటులు ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30 వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











