రాజమౌళి ఆలోచనలో మహేష్, ప్రభాస్.. నిజమైతే అభిమానులకి పండగే!
దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా ఇక నుంచి దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడుతుందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. బాలీవుడ్ దర్శకులు ఎంత పెద్ద సినిమా చేసినా వారి సినిమాలు కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ రాజమౌళి సినిమాలు అలా కాదు. టాలీవుడ్ నుంచి డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో దేశం దాటి వెళుతున్నాయి. అందుకే ఆయనతో సినిమా అంటే ఎలాంటి హీరో అయినా రెడీ అవ్వాల్సిందే.

రిలీజ్ కాకముందే హై డిమాండ్..
బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ అనంతరం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో RRR సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ బడా మల్టీస్టారర్ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

RRR తరువాత ఎవరితో?
రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో చేస్తున్న మల్టీస్టారర్ కావడంతో తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమామ్ రికార్డులను బద్దలు కొట్టగలదని ఇప్పటికే జనాల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఆ సినిమా తరువాత రాజమౌళి ఏ సినిమా చేసినా ఆ క్రేజ్ ని ఊహించడం కష్టమే. RRR సినిమా 450కోట్లతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక సినిమా కలెక్షన్స్ 1000కోట్లు ఈజీగా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.

రాజమౌళితో మహేష్..
RRR అనంతరం రాజమౌళి మహేష్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. ఇదివరకే రైటర్ విజయేంద్ర ప్రసాద్ వీరి కాంబినేషన్ పై ఒక క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తారని అయితే ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనే విషయం ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ఇక మహేష్ కూడా జక్కన్నతో కొన్నిసార్లు సినిమా చేయాలని డిస్కర్షన్స్ చేసినట్లు చెప్పారు.
Recommended Video

నిజమైతే అభిమానులకు పండగే..
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రభాస్ తో మరొక సినిమా చేయాలని ఉందని క్లారిటీ ఇచ్చారు. మంచి కథ సెట్టయితే తప్పకుండా అతనితో సినిమా చేయడానికి తాను సిద్ధమని అన్నారు. ప్రభాస్ తో ఐదేళ్లు పని చేశాను కాబట్టి అతనితో మంచి స్నేహం ఏర్పడిందని కూడా అన్నారు. అయితే ప్రభాస్ , మహేష్ లాంటి హీరోలతో ఎలాంటి సినిమా చేసిన వారి అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











