»   »  ‘బాహుబలి’... మూడో పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారా?

‘బాహుబలి’... మూడో పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే ‘బాహుబలి' పార్ట్ 1 విడుదలైంది కూడా. త్వరలో బాహుబలి పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలు కాబోతోంది.

బాహుబలి పార్ట్ 2 రాకతో ఇక ఈ సినిమా ముగిసిట్లే అనుకుంటే పొరపాటే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... ‘బాహుబలి' పార్ట్ 3 కూడా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఇటీవల విడుదలైన ‘బాహుబలి' సినిమాకు ఇండియా వ్యాప్తంగా ఊహించని రెస్పాన్స్ రావడంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారట. సెకండ్ పార్ట్ కు కొనసాంగిపు ఉండేలా కథలో మార్పులు చేస్తున్నారట. త్వరలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Rajamouli Planning Part 3 For Baahubali

2016లో బాహుబలి-2 విడుదలవుతుందని గతంలో ప్రకటించినప్పటికీ... మరో ఏడాది ఆలస్యంగా, అంటే 2017లో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. సినిమా కథలో మరిన్ని మార్పులు చేసి, పార్ట్ 3 కూడా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా అనుకున్న దాని కంటే మరింత బెటర్ గా తీయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి అండ్ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచరాం.


వాస్తవానికి బాహుబలి సినిమా ఇంత భారీ విజయం సాధిస్తుందని రాజమౌళి కూడా ఊహించలేదు. మరో వైపు ‘బాహుబలి' విదేశీ బాషల్లోనూ అదరగొడుతోంది. అందుకే మరిన్ని మార్పులు చేసి ఇటు ఇండియన్, అటు ఇంటర్నేషనల్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

English summary
Film Nagar source said that, Director SS Rajamouli is planning to make part 3 for the historical blockbuster Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu