RRR: భారీ స్కెచ్ వేసిన రాజమౌళి.. చిత్రంలో అదే హైలైట్!
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీలో ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
చిత్రంలో ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ దశలోనే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ ఓ పులితో ఫైట్ చేసే సన్నివేశాన్ని షూట్ చేసిన జక్కన్న.. ఇప్పుడు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసే పనిలో పడ్డారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం '300 యోధులు' సినిమాలో తోడేలు ఫైట్ నుండి ఇన్స్పైర్‌గా తీసుకున్నారు టాక్. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది.

బాహుబలి సిరీస్‌తో సత్తా చాటిన రాజమౌళి ఇప్పుడు 'RRR' విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాలీవుడ్‌కి దీటుగా సినిమాలు తెరకెక్కిస్తున్న జక్కన్న.. 'RRR' కోసం ఈ స్థాయిలో పోరాట సన్నివేశాలు చిత్రీకరించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇక ఇప్పటికే 70 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై రకరకాల వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా RRR కోసం జనం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











