»   » దర్శకుడు రాజమౌళి ముందు చూపు, ఆ వ్యాపారంలోకి?

దర్శకుడు రాజమౌళి ముందు చూపు, ఆ వ్యాపారంలోకి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్(విఎఫ్ఎక్స్) ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయో కొత్తగా చెప్పాలిన పని లేదు. మగధీర, ఈగ సినిమాల్లో గ్రాఫిక్స్‌దే కీలక పాత్ర. మర్యాద రామన్న సినిమాలో కూడా ఆయన గ్రాఫిక్స్ ఉపయోగించారు. ఇక తాజాగా తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రం కూడా సగానికి సగం గ్రాఫిక్స్ మాయాజాలంతోనే నిండి ఉండబోతోంది.

ప్రస్తుతం సినీ పరిశ్రమలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎంతో కీలకంగా మారాయి. రాను రాను భారత్‌లో హాలీవుడ్ తరహాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన సినిమాల నిర్మాణం పెరుతున్న నేపథ్యంలో.....రాజమౌళి సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు టాక్. సొంతగా సినిమాలకు సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని స్థాపించాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది.

Rajamouli

ఇక రాజమౌళి తర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి' సినిమా వివరాల్లోకి వెళితే....ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బాహుబలి చిత్రంలో రానా, ప్రభాస్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సినిమా మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. రానా ఇందులో నెగెటివ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు.

దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.

English summary
Film nagar source said that, Tollywood Director Rajamouli plans to open a VFX company. Rajamouli, the No.1 director of Tollywood film industry, is trying out a new flick "Baahubali", which is expected to create sensation in Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu