RRR లేటెస్ట్ అప్‌డేట్.. ఆ విషయంలో రామ్ చరణ్‌పై ఎన్టీఆర్‌దే పైచేయి!

ఇద్దరు స్టార్ హీరోలు తెరపంచుకోవడమంటేనే సెన్సేషన్. ఆ రోజుల్లో నాగేశ్వర్ రావు, రామారావు లాంటి స్టార్ హీరోలు ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు చేసినప్పటికీ.. వారితో పోల్చుకుంటే నేటి యంగ్ హీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో ఎక్కువగా నటించడం లేదు. ఇలాంటి పరిణామానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే కోణంలో రాజమౌళి పవర్ ఫుల్ స్కెచ్ వేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో భారీ సినిమాకు తెరలేపారు. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా వినిపిస్తున్న ఓ వార్త ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి పోతే..

 RRR రామ్ చరణ్, ఎన్టీఆర్.. రాజమౌళి స్కెచ్

RRR రామ్ చరణ్, ఎన్టీఆర్.. రాజమౌళి స్కెచ్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ రాజమౌళి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడని విన్నాం. కానీ ఒక్క విషయంలో మాత్రం రామ్ చరణ్‌పై ఎన్టీఆర్‌దే పైచేయి కానుందని టాక్ నడుస్తోంది.

చెర్రీతో బాలీవుడ్ భామ.. ఎన్టీఆర్‌తో హాలీవుడ్ బ్యూటీ

చెర్రీతో బాలీవుడ్ భామ.. ఎన్టీఆర్‌తో హాలీవుడ్ బ్యూటీ

వచ్చే ఏడాది జులై నెలాఖరు టార్గెట్ గా పెట్టుకున్న RRR మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా, రీసెంట్‌గా ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్‌ను సెలెక్ట్ చేశారు జక్కన్న.

 హాలీవుడ్ బ్యూటీ కదా! అందుకే ఆ డోస్..

హాలీవుడ్ బ్యూటీ కదా! అందుకే ఆ డోస్..

ఇక ఈ చిత్రంలో పాటలు, రొమాన్స్ విషయంలోనూ ప్రత్యేక దృష్టి పెట్టారట రాజమౌళి. ఈ మేరకు రామ్ చరణ్- ఆలియా భట్ జోడీ కంటే ఎక్కువగా ఎన్టీఆర్- ఒలివియా మోరీస్‌ జోడీతో రొమాంటిక్ సీన్స్ పండించేలా డిసైడ్ అయ్యారట జక్కన్న. హాలీవుడ్ బ్యూటీ కాబట్టి ఆమెతో రొమాన్స్ డోస్ పెంచితే ఆడియన్స్ థ్రిల్ అవుతారని, అందుకే ఆయన ఇలా డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది.

జక్కన్న దృష్టి మొత్తం ఆమె పైనే

జక్కన్న దృష్టి మొత్తం ఆమె పైనే

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం RRR షూటింగ్ 70 శాతం పూర్తయింది. ఇందులో చరణ్ జోడీగా నటిస్తున్న ఆలియా భట్ పార్ట్ షూటింగ్ పూర్తి కావడంతో ఆమె ముంబై వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు జక్కన్న దృష్టి మొత్తం ఎన్టీఆర్ భామ ఒలివియా మోరీస్‌ పైనే పెట్టారట. ప్రస్తుతం ఎన్టీఆర్- ఒలివియా మోరీస్‌ జోడీపై హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నారని సమాచారం.

Recommended Video

#CineBox : Nani's New Film Titled Tuck Jagadish
10 భాషల్లో RRR.. ఇదీ సంగతి

10 భాషల్లో RRR.. ఇదీ సంగతి

ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణంలో RRR సినిమా రూపొందుతోంది. చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జూలై 30 వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సహా మొత్తం 10 భాషల్లో RRR విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X