»   » చంద్రబాబు ఆఫర్ తిరస్కరించిన రాజమౌళి?

చంద్రబాబు ఆఫర్ తిరస్కరించిన రాజమౌళి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు భారీగా చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కలర్ ఫుల్ గా, వైభవంగా సాగేందుకు కావాల్సిన అన్ని హంగులను సిద్ధం చేస్తున్నారు. శంఖుస్థాపన వేడుకల్లో పలువురు సినీ తారల సందడి కూడా ఉండబోతోంది.

Rajamouli

కాగా....ప్రధాన మంత్రి మోడీ కూడా హాజరువుతుండటంతో ఈ వెంటుకు సంబంధించిన స్టేజ్, ఇతర డెకొరేషన్స్ గ్రాండ్ లుక్ వచ్చేలా దర్శకుడు రాజమౌళిని ఏర్పాట్లు పర్యవేక్షించాలని అడిగారట. అయితే బాహుబలి 2 సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల తనకు వీలు కాదని జక్కన్న చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రాజమౌళి ఈ ఆఫర్ తిరస్కరించడానికి కారణం ‘బాహుబలి-2' పనులతో బిజీగా ఉండటంతో పాటు.....ఇలాంటి వాటిలో తలదూరిస్తే రాజకీయ పరమైన కాంట్రవర్సీలు ఏమైనా ఎదురవుతాయనే కారణం కూడా ఉండొచ్చని అంటున్నారు. రాజమండ్రి పుష్కరఘాట్ అనుభవంతో బోయపాటి కూడా సైలెంటుగా ఉన్నాడట.

దీంతో...స్టేజీ, ఇతర డెకొరేసన్ ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలు రాజీవ్ సేథీకి అప్పగించినట్లు సమాచారం. అమరావతి ప్రాచీన ఉట్టిపడేలా ఆయన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

English summary
For the Amaravathi capital city foundation laying ceremony that is to be held on October 22nd, he has asked Tollywood’s top director S S Rajamouli to oversee all the decorations for the stage at the venue. But the director Rajamouli politely refused to accept saying he is busy with the pre-production of Baahubali 2.
Please Wait while comments are loading...