twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరికి కరోనా టెన్షన్.. జక్కన్నకి మాత్రం సూపర్ రిలీఫ్.. లేదంటే దారుణంగా !

    |

    మన దేశంలోనే కాక అన్ని దేశాలలో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా భారత దేశంలో గడిచిన 24 గంటల్లో మూడు లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు రెండు వేలకు పైగా మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం గా ఉంది.. కరోనా ధాటి ఇంత భారీగా ఉండడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే లాక్‌డౌన్‌ లోకి వెళ్లి పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు పెద్ద సినిమాల షూటింగులు అన్ని ఆగిపోతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే థియేటర్లు మూసేస్తూ నిర్ణయం తీసుకోగా ఏపీలో కూడా థియేటర్ యాజమాన్యాలు అనధికారికంగా మూసివేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత టెన్షన్ లో అందరూ ఉంటే రాజమౌళి మాత్రం ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగా కాస్త రిలాక్స్ అవుతున్నాడు. అదేంటి అనుకుంటున్నారా, అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే.

    గ్రాఫిక్స్ వర్క్ టెన్షన్

    గ్రాఫిక్స్ వర్క్ టెన్షన్

    అసలు విషయం ఏంటంటే ప్రస్తుతానికి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అనే ఒక ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. నిజానికి రాజమౌళి సినిమా అంటేనే వాయిదాలు షరా మామూలు అనే స్థాయికి వచ్చేసింది పరిస్థితి. ఆయన సినిమాల్లో ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఇంపార్టెన్స్ ఇస్తాడు, అదే ఆయన సినిమాలను వాయిదా పడేలా చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. అయితే మొన్నీ మధ్య అన్ని సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. దసరా సందర్భంగా 13 అక్టోబర్ రోజున రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.

    కలిసొచ్చిన సెకండ్ వేవ్..

    కలిసొచ్చిన సెకండ్ వేవ్..

    అయితే రిలీజ్ డేట్ ప్రకటించారు కానీ సినిమా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. దానికి కారణం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కోసం దాదాపు ఆరు నెలలకు పైగా సమయం వెచ్చించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యాక ఆరు నెలల సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ చేసి అంతా తీర్చిదిద్దితే అప్పుడు సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. కానీ సినిమాని రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు ఈ కారణాలతో వాయిదా వేస్తే సినిమా మీద ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి మళ్లీ వాయిదా ఎలా వేయాలా ? అని ఆలోచిస్తున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో దాదాపు మిగతా సినిమాలు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.

    ట్రోల్స్ నుండి సేఫ్...

    ట్రోల్స్ నుండి సేఫ్...


    అలా రాజమౌళికి ఈ కరోనా సెకండ్ వేవ్ కాస్త కలిసి వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సెకండ్ వేవ్ ధాటికి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. సరిగ్గా గత ఏడాది కూడా ఇదే సమయానికి షూటింగ్ ఆపేసి సినిమా వాయిదా వేశారు. ఈ ఏడాది కూడా అదే కారణంతో సినిమా షూటింగ్ ఆపేసి వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తోంది. రాజమౌళి కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడితే అందరూ ఆయన టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్స్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కరోనా కారణం వాయిదా అని ప్రకటిస్తూ ఉండడంతో ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. అలా రాజమౌళి ఈ విషయంలో సేఫ్ అయిపోయాడు.

    Recommended Video

    Mahesh Babu Pan India Line Up | Sarkaru Vaari Paata | Filmibeat Telugu
    వచ్చే సంక్రాంతికే

    వచ్చే సంక్రాంతికే


    అలా కరోనా సాకుగా చూపి మరోసారి తన సినిమాను వాయిదా వేసే అవకాశం రాజమౌళికి దక్కింది. తనను ట్రోల్ చేసే అవకాశం లేకపోవడంతో రాజమౌళి కాస్త రిలాక్స్ మోడ్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వాయిదా గురించి ఇప్పుడే ప్రకటించరని చెబుతున్నారు. సినిమా షూటింగ్ మళ్ళీ మొదలై కాస్త కుదుట పడ్డారని భావించినప్పుడు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ప్రకటించిన దాని మేరకు ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది.

    English summary
    Director Rajamouli getting relaxed with corona second wave. actually rajamouli in tension to release movie by october 13th. but with corona second wave tension this can be postponed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X