»   » ఇది నిజమేనా : ‘బాహుబలి’ సెన్సార్ టాక్

ఇది నిజమేనా : ‘బాహుబలి’ సెన్సార్ టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్సకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ‘బాహుబలి' . ఈ చిత్రం సెన్సార్ రీసెంట్ గా పూర్తైన సంగతి తెలిసిందే. 2 గంటలు 39 నిముషాలు ఉన్న ఈ చిత్రానికి U/A రేటింగ్ ఇవ్వటం జరిగింది. ఈ చిత్రానికి సెన్సార్ టాక్ అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఒకటి వినపడుతోంది. అదేంటో మీరూ చూడండి.

బాహుబలి ఫస్టాఫ్ లో ...కొంత రొమాన్స్, ఫన్, లవ్ లీ గా సీన్స్ ని డిజైన్ చేయటం జరిగింది. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి ఛత్రపతి తరహా ఎమోషన్ తో ఉన్నట్లు తెలు్సతోంది. దాదాపు ఈ ఎపిసోడ్ 15 నిముషాలు పాటు ఉండనుందని సమాచారం.

సెకండాఫ్ విషయానికి వస్తే... సెంటిమెంట్ కాస్త ఎక్కువగా ఉందని, అనుష్క పాత్రను ఇక్కడ రివిల్ చేయటం జరిగిందని తెలుస్తోంది. అలాగే దాదాపు 45 నిముషాలు పాటు యుద్దం సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే క్లైమాక్స్ ముందు ఓ ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చారని చెప్తున్నారు. టోటల్ ఈ చిత్రం ఎమోషన్ తో యాక్షన్ చిత్రంగా మలిచినట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్లు, పాటలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతోంది.

 Rajamouli's Baahubali Censor Talk

అలాగే ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని
, చైనా లాంటి దేశాల్లో సైతం రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సాంప్రదాయ ప్రెస్, మీడియా ప్రచారాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచార కార్యక్రమాలతో ‘బాహుబలి' దూసుకుపోతోంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తోన్న బాహుబలి టీమ్ సోషల్ మీడియా ద్వారానే ఈ స్థాయి ప్రచారాన్ని సొంతం చేసుకుంది.

ఇక సోషల్ మీడియా ప్రమోషన్లలో భాగంగా మమతల తల్లి వీడియో సాంగ్‌ను విడుదల చేయగా ఆ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేడు బాహుబలిలోని నిప్పులే శ్వాసగా పాటకు సంబంధించిన వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ పాటలో ఇంతకుముందు చూసిన చాలా షాట్లను మళ్ళీ చూపించారు.

అయితే కొన్ని కొత్త షాట్స్ కూడా జతచేయడంతో సాధారణంగానే ప్రతీ కొత్త షాట్‌కూ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రభాస్, రానా, అనుష్క తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే!

ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది.

English summary
On a whole, Baahubali film is more of an emotional story rather purely action, says the talk.
Please Wait while comments are loading...