»   » “బాహుబలి : ది బిగినింగ్” ఆడియో విడుదల తేదీ

“బాహుబలి : ది బిగినింగ్” ఆడియో విడుదల తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్మాత్మాకంగా రూపొందిస్తున్న ‘బాహుబలి' చిత్రం భారీ బడ్జెట్‌తో ఈ వేసవిలో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో రాజమౌళి ప్రమోషన్ పనులును వేగవంతం చేసి రోజుకో రెండు రోజులకో పోస్టర్ చొప్పిన వదిలి సినిమాపై క్రేజ్ ని పెంచుతున్నారు.

ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో చిత్రం ఆడియో విడుదలకు సైతం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియోని మే 31 న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అదే రోజు చిత్రం ట్రైలర్ ని సైతం వదులుతారు. అయితే ఈ విషయమై నిర్మాతలు తేదీ ఖరారు చేస్తూ ప్రకటన ఇంకా విడుదల చేయలేదు.


Rajamouli's “Baahubali: The Beginning” music gets date?

మరో ప్రక్క పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం బిజినెస్‌ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోంది. తెలుగు నాట ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్‌ హక్కులు కూడా అమ్ముడయిపోయాయి. ప్రభాస్‌తో ‘మిర్చి', శర్వానంద్‌తో ‘రన్‌ రాజా రన్‌' చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ సంస్థ తమిళనాడుకు చెందిన స్డూడియో గ్రీన్‌ సంస్థతో కలిసి ఈ హక్కులను సొంతం చేసుకుంది.


ఈ తమిళ వెర్షన్‌ హక్కులు సుమారు రూ.25 కోట్లు పలికినట్లు కోలీవుడ్‌ సమాచారం. ‘బాహుబలి' చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. వంద సెకండ్ల నిడివిగల ట్రైలర్‌ను చూపించే విధంగా ఎడిట్‌ చేస్తున్నారని ఫిలింనగర్‌ సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఇక భారీ వ్యయంతో రూపొందిస్తున్న బాహుబలి చిత్రానికి సంబంధించిన ఐదవ పోస్టర్‌ను దర్శకుడు రాజవౌళి సామాజిక మాధ్యమంలో సోమవారం పోస్ట్ చేశారు. నటుడు ప్రభాకర్ కాళకేయగా నటించిన సన్నివేశంతో కొత్త పోస్టర్ వచ్చింది. ఇప్పటివరకు నాలుగు పోస్టర్‌లను విడుదల చేసి సంచలనం సృష్టించిన రాజవౌళి బాహుబలి చిత్రం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చిత్రం విడుదల ఆలస్యం అవుతూండటంతో రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తూ రాజవౌళి వినూత్న ప్రచారానికి తెరదీశారు.

English summary
“Baahubali: The Beginning” is gearing up for a grand audio launch on May 31st in Hyderabad.
Please Wait while comments are loading...