»   » హాట్ న్యూస్: 'బాహుబలి' లో కొత్త సీన్లు కలుపుతున్నారు

హాట్ న్యూస్: 'బాహుబలి' లో కొత్త సీన్లు కలుపుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'బాహుబలి' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.250కోట్ల వ్యయంతో ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ చిత్రం చూసిన చాలా మంది...ఎడిటింగ్ చాలా హడావిడిగా చూసినట్లు అనిపిస్తుంది. అంతేకాక...కొంత కన్ఫూజన్ కు గురి అయిన ఫీల్ వచ్చిందనే టాక్ వినిపించింది. ఈ నేపధ్యంలో ... ఓ పది నిముషాలు సీన్లు ఈ సినిమా కు కలిపి...కన్ఫూజన్ తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. సెకండాఫ్ లో ...సుబ్బరాజు, నాసర్, అనుష్క, ప్రభాస్, రానా ల మధ్య వచ్చే సన్నివేశాలు కలుపుతారని వినికిడి.


ప్రస్తుతం ఈ చిత్రం గూగుల్‌, ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో మొదటిస్థానంలో నిలిచి సామాజిక అనుసంధాన వేదికల్లోనూ సత్తా చాటింది. మొత్తం 4వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభాస్‌, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు ముఖ్యభూమికలు పోషించారు.


Rajamouli's Baahubali to bowl with new scenes

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాహుబలి' ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం దాదాపుగా రూ.68 కోట్ల షేర్‌ వసూలు చేసి ట్రేడ్‌ వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది భారతీయ చిత్రపరిశ్రమ రికార్డుగా ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.


ఇది వరకు షారుఖ్‌ ఖాన్‌ నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్‌' రూ.65 కోట్లు సాధించిందని సమాచారం. ఆ లెక్కన బాలీవుడ్‌ రికార్డులూ పటాపంచలైనట్టే. ఒక్క హిందీ అనువాదమే రూ.5 కోట్లు వసూలు చేసిందని లెక్కలు చెబుతున్నాయి. హిందీలో అనువాదమైన ఓ ప్రాంతీయ చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు దక్కడం ఇదే ప్రథమం.


విదేశాల్లో అయితే 'బాహుబలి' చెలరేగిపోతోంది. గురు, శుక్రవారాలు కలిపి ఒక్క అమెరికాలోనే 2.4 మిలియన్‌ డాలర్లు సంపాదించింది. మొత్తంగా ఓవర్సీస్‌ మార్కెట్‌లో రూ.16 కోట్లు కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి రూ.36 కోట్ల రూపాయల షేర్‌ సాధించినట్టు తెలుస్తోంది.

English summary
Apart from adding Baahubali 2 scenes so that viewers don't get confused, they are also adding new 10 min scenes.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu