For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైనాలో ‘బాహుబలి’ సెన్సేషన్, ప్రభాస్ టాటూలు, నిజమా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి 'బాహుబలి' సినిమాను హాలీవుడ్ లెవల్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు...ఇంగ్లీష్, ఇతర విదేశీ బాషలైన చైనా, జపాన్ బాషల్లోనూ విడుదల చేయడానికి ఏరాట్లు చేస్తున్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రం చైనాలో 'కుంగ్‌ఫు ఫ్లై' పేరుతో విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. స

    దీంతో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'బాహుబలి' సినిమాకు చైనాలో క్రేజ్ ఏర్పడింది. పలువురు చైనా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చైనాలో బాహుబలి సినిమా గురించి తెలిసి పోయింది. కొందరు ప్రభాస్ టాటూలను కూడా తమ ఒంటిపై వేయించుకుంటున్నారట. కొన్ని పబ్బుల్లో కూడా 'బాహుబలి' పోస్టర్లను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Rajamouli's Bahubali Creating Sensation in China

    రాజమౌళి కూడా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు లేనంతగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇండియాతో పాటు విదేశీ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు కాబట్టి తెలుగు సినిమా చరిత్రలో రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టే తొలి సినిమా ఇదే అని అంటున్నారు.

    ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బాహుబలి'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ షెడ్యూల్ పూర్తయింది. సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తర్వాతి షెడ్యూల్ మహాబేలేశ్వర్‌లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 26 నుండి మహాబలేశ్వర్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని సమాచారం. అక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత యూనిట్ మళ్లీ రాజమోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కంటిన్యూ చేయనున్నారు.

    English summary
    Rajamouli's Bahubali Creating Sensation in China. Moreover, the released posters of Baahubali in China are so widely appreciated that many people have tattooed Prabhas posters on their body and some of the Pubs are promoting the Baahubali posters for their trade.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X