రాజమౌళి జబర్దస్త్ స్కెచ్.. ఫిదా అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ వెంటనే!
దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే RRR విడుదలను వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020లో RRR విడుదల లేదని ఆయన స్పష్టం చేయడంతో మెగా, నందమూరి అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు. అంటే తమ అభిమాన హీరోలు ఇంకా ఏడాది పాటు జక్కన్నతోనే జర్నీ చేయాలా? మరి వీళ్ళ తదుపరి ప్రాజెక్టుల సంగతేంటో! అని చెప్పుకున్నారు. అయితే ఇదే అంశం గురించి ఆలోచించిన రాజమౌళి ఆ ఇద్దరు హీరోల కోసం జబర్దస్త్ స్కెచ్ వేశారట. ఆ వివరాలేంటో చూద్దామా..

RRR షూటింగ్.. రామ్ చరణ్, ఎన్టీఆర్
గతేడాది ప్రారంభమైన RRR షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన జక్కన్న.. సర్వ హంగులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా షూటింగ్ చేపడుతున్నారు. ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

విడుదల వాయిదా.. అభిమానులు షాక్
RRR షూటింగ్ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 70 శాతం మేర షూటింగ్ ఫినిష్ అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ముందుగా చెప్పనట్లే ఈ సినిమాను జులై నెలాఖరులో విడుదల చేస్తారని కోటి ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ ఊహించని విధంగా చిత్రాన్ని 2021 జనవరి 8కి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించి షాకిచ్చారు జక్కన్న.

మెగా, నందమూరి అభిమానుల సందేహం.. రాజమౌళి ప్లాన్
దీంతో మెగా, నందమూరి అభిమానుల్లో కొత్త కొత్త సందేహాలు పుట్టుకొచ్చాయి. మరో ఏడాది పాటు తమ అభిమాన హీరోలిద్దరూ RRR తప్ప మరో సినిమా సెట్స్ పైకి వెళ్లే పరిస్థితి లేకపోవచ్చు అని అనుకున్నారు. మరోవైపు సరిగ్గా ఇదే అంశంపై ఆలోచన చేసిన రాజమౌళి జబర్దస్త్ స్కెచ్ వేసి రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు డెడ్ లైన్ ఫిక్స్ చేసేశారని సమాచారం.

టెన్షన్ వీడేలా.. రాజమౌళి నిర్ణయం
తనతో పాటే ఇద్దరు హీరోలను కూడా ఇంకా ఏడాది పాటు లాక్ చేసి ఉంచుతున్నాడా అనే టెన్షన్ వీడేలా.. ఆ ఇద్దరినీ మే లోపే వదిలేయాలని నిర్ణయించుకున్నారట రాజమౌళి. ఈ మేరకు మే నెల తర్వాత వారి వారి తదుపరి ప్రాజెక్ట్స్ చేసుకోమని మాటిచ్చారట. కాకపోతే అక్కడా ఓ కండీషన్ పెట్టారని తెలుస్తోంది.

పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి.. కండీషన్
మే నెల నుంచి నవంబర్ నెల వరకు వేరే సినిమాలు చేసుకోడానికి పర్మిషన్ ఇచ్చిన రాజమౌళి.. డిసెంబర్ నెల మాత్రం తనకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోవద్దని రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు చెప్పారట. RRR ప్రమోషన్స్ నిమిత్తం డిసెంబర్ అంతా తనకే కేటాయించాలని చెప్పారట. దీనికి ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఓకే చెప్పేశారని తెలుస్తోంది.
Recommended Video

RRR తర్వాత.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే
ఇకపోతే RRR తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్నాడు. అదేవిధంగా రామ్ చరణ్ తన తర్వాతి సినిమాను 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. సో.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ రెండు సినిమాలకు ఈ ఏడాదే కొబ్బరికాయ కొట్టడం ఖాయం.


Click it and Unblock the Notifications











