ప్రభాస్ కి రాజమౌళి ఆ కండీషన్
హైదరాబాద్: ప్రభాస్,రాజమౌళి ల తాజా చిత్రం బాహుబలి షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం చాలా విశేషాలతో నిండి,ప్రేక్షకులకు థ్రిల్ కలగ చేయనుంది. ఈ నేపధ్యంలో చిత్రంలో హీరో ప్రభాస్ పాత్ర,గెటప్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీక్రెసీ మెయింటైన్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా ఆ మధ్యన ప్రభాస్ స్టిల్స్ మీడియాలో వచ్చేయటంతో ఖంగుతిన్న రాజమౌళి...ప్రబాస్ ని.. కొంతకాలం పాటు పంక్షన్స్ కు, పబ్లిక్ కు దూరంగా ఉండమని కండీషన్ పెట్టినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందుకే ప్రబాస్ రీసెంట్ గా చండీ ఆడియో పంక్షన్ కి హాజరు కాలేదని తెలుస్తోంది.
ప్రభాస్, సెన్సేషన్ హిట్ చిత్రాల దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న 'బాహుబలి' మూవీ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఆగస్టు 12 నుంచి రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రముఖ బాలీవుడ్ కళా దర్శకడు సాబె సిరిల్ ఆధ్వర్యంలో భారీ సెట్ వేసారు. ఇక్కడే సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ జరుగనుంది. తొలి షెడ్యూల్‌లో కర్నూలు సమీపంలోని కొండ ప్రాంతాల్లో ఇటీవల కొన్ని సీన్లు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. బాహుబలి చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం 'arri alexa XT' కెమెరాలను ఉపయోగించనున్నారు.
ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.


Click it and Unblock the Notifications












