twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వావ్...టర్కిష్ భాషలోకి మన సినిమా

    By Srikanya
    |

    హైదరాబాద్ : తమ సినిమా రాష్ట్రం దాటటమే కష్టం అనుకుంటూంటే...ఏకంగా దేశాలు, సముద్రాలు దాటి రికార్డులు క్రియేట్ చేస్తోంది...రాజమౌళి ఈగ. గ్రాఫికల్ వండర్ గా అభివర్ణించబడే ఈగ చిత్రం ఇప్పుడు ధాయ్,చైనీస్ భాషల వారికే కాక టర్కిష్ భాష వారికి కూడా అందుబాటులో రానుంది. ఈ మేరకు టర్కిష్ భాషలోకి డబ్బింగ్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో పూర్తి వివరాలు వచ్చే అవకాసం ఉంది.

    సరదా కుర్రాడైన నాని (నాని)ఎదురింటి అమ్మాయి బిందు (సమంత)ని ప్రేమిస్తాడు. అతని ప్రేమను ఆమె అంగీకరిస్తుందనే సమయానికి రావణాసుడులా సుదీప్‌ (సుదీప్‌)ఆమెపై కన్నేసి అడ్డుపడతాడు. అంతేగాక ఆమెను దక్కించుకోవటం కోసం నానిని దారుణంగా హత్య చేస్తాడు. అయితే కథ అక్కడితో అయిపోదు.. మగధీరలా నాని.. మరుజన్మ ఎత్తుతాడు. అయితే ఈ సారి ఈగ గా జన్మిస్తాడు. గతజన్మ స్మృతులతో తన ప్రేయసిని కాపాడుకునేందుకు సుదీప్ పై ఎడతెగని యుద్దం ప్రకటిస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఎలా బలవంతుడైన సుదీప్ నుంచి అతి సాధారణమైన ఈగ అయిన తాను .. తన ప్రేయసిని తప్పించాడు అనేది మిగతా కథ.

    Rajamouli's Eega in Turkish

    ఇక ఇప్పటికే దేశంలో వివిధ పురస్కారాల్ని అందుకున్న 'ఈగ' చిత్రం ఇటీవల నిర్వహించిన టొరంటో 'ఆఫ్టర్‌ డార్క్‌ చిత్రోత్సవం'లోనూ పురస్కారాల జోరు కొనసాగించింది. ఏకంగా తొమ్మిది పురస్కారాల్ని సాధించింది. హీరో, విలన్, యాక్షన్‌ ఫిల్మ్‌, వినోదం, మోస్ట్‌ ఒరిజినల్‌ ఫిల్మ్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, పోరాటాలు, ఫిల్మ్‌ టు వాచ్‌ విత్‌ క్రౌడ్‌, ఎడిటింగ్‌ విభాగాల్లో ఈ సినిమా పురస్కారాల్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకుల మనుసుల్ని దోచిన రాజమౌళి 'ఈగ' అదే స్థాయిలో పురస్కారాల్ని కూడా అందుకోవటం అందరినీ ఆనందపరుస్తోంది.

    ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ఈచిత్రం ఇంతకుముందు బి. నాగిరెడ్డి అవార్డుకు ఎంపికయింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించిన సాయి కొర్రపాటి అవార్డును అందుకోనున్నారు. నాగిరెడ్డి జయంతి రోజున అవార్డు ప్రధానం జరుగనుంది. ఇక ఈ సినిమాలో కళా దర్శక పరంగా కీలకమైన కృషి చేసిన కళాదర్శకుడు రవీందర్‌కి అరుదైన పురస్కారం లభించింది. కళాదర్శకుడు రవీందర్‌, ప్రతిష్టాత్మకమైన బ్రెజిల్‌ చిత్రోత్సవంలో పురస్కారం అందుకొన్నారు. అలాగే 60వ జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికవడంతో పాటు, విజువల్ ఎఫెక్ట్ విభాగంలోనూ అవార్డులు దక్కించుకుంది. ఇవే కాకుండా అనేక అవార్డులు ఈ చిత్రాన్ని వరించాయి. తాజాగా ఈచిత్రం ప్రఖ్యాత అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో ప్రదర్శనకు 'ఈగ' చిత్రాన్ని కూడా ఎంపిక చేసారు.

    "సినిమా చేసేటప్పుడు అవార్డుల గురించి ఎప్పుడూ ఆలోచించను. వాటిని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోను. ప్రకటించారని తెలిసినప్పుడు సంతోషంగా ఉంటుంది'' అని రాజమౌళి గతంలో 'ఈగ' జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైనప్పుడు అన్నారు. 'ఈగ' దర్శకుడు రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...నేను నిద్రపోతుంటే 'బాహుబలి' నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ఫోన్ చేసి 'ఈగ'కు అవార్డులు వచ్చాయని చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు వచ్చినందుకు ఆనందమే. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అవార్డుల గురించి చాలా మంది మాట్లాడారు కానీ నేను పట్టించుకోలేదు. నా దృష్టిలో 'ఈగ' సినిమా పూర్తయింది. ఇప్పుడు 'బాహుబలి' మీదే నా దృష్టి అన్నారు.

    English summary
    Rajamouli's “Eega” will be dubbed in some international languages like Thai and Chinese. Now the film makers are in plans to remake this film in Turkish language too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X