రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’..కథ దొరికింది?
హైదరాబాద్: రాజమౌళి తన కెరీర్లో 'మహాభారతం' చిత్రాన్ని తీయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆ సినిమా ఎప్పుడు తీస్తారో తెలియదు కానీ...కథా వస్తువు దొరికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బైరప్ప అనే కన్నడ రచయిత రాసిన 'పర్వ' అనే నవల ఆధారంగా ఆయన మహాభారతం తీయాలనే యోచనలో ఉన్నారట. మహాభారతానికి కాల్పనికత జోడించిన ఈ నవల ఎంతో ఆసర్తికరంగా ఉందట.
ప్రస్తుతం బుహుబలి చిత్రాన్ని తాను అనుకునప్నట్లు తీయడానికి దాదాపు రూ. 100 కోట్లపైనే భడ్జెట్ ఖర్చు పెట్టిస్తున్నారు రాజమౌళి. ఇక మహాభారతం లాంటి సినిమా తీయాలంటే భారీ తారాగణం అవసరం, ఖర్చుకూడా బాగానే ఉంటుంది. ఇప్పటి లెక్కల ప్రకారం కనీసం రూ. 300 కోట్లు ఉంటుందని అంటున్నారు.
తాను తీయబోయే 'మహాభారతం' చిత్రాన్ని కేవలం తెలుగు వరకే పరిమితం చేయకుండా దేశంలోని అన్ని పరిశ్రమల స్టార్లతో ప్లాన్ చేయాలనుకుంటున్నారట. అప్పుడే సినిమా బడ్జెట్‌కు తగిన విధంగా వసూళ్లు సాధిస్తుందనేది రాజమౌళి ఆలోచనగా కనిపిస్తోంది.

వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ రేంజిలో ఉన్నాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు ఎంత పెద్ద దర్శకుడైనా స్టార్ హీరోల డేట్స్ కోసం వారి చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటే....రాజమౌళి విషయంలో మాత్రం ఇది పూర్తి రివర్స్. ఆయనతో సినిమా చేసే అవకాశం కోసం పలువురు స్టార్ హీరోలే రాజమౌళి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. కేవలం సినిమాల పరంగానే కాకుండా...స్టార్ హీరోల మాదిరిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడంలోనూ ఆయనకు ఆయనే సాటి.
ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆయన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య లక్షల్లో ఉంది. తాజాగా ఆయన్ను ఫోలో అయ్యే వారి సంఖ్య 2 మిలియన్ల (20 లక్షలు)కు చేరుకుంది. ఫాలోవర్స్ సంఖ్య 2 మిలియన్స్‌కు చేరిన సందర్భంగా రాజమౌళి అందరికీ థాంక్స్ చెప్పారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన 'బాహుబలి' అనే సినిమాను తెరకెక్కిస్తూ బిజీగా గడుపుతున్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు...ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా ఈచిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్, రానా, అనుష్క ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











