ఇంటిని మరిచిన రాజమౌళి, సెకండ్ సెటప్ తోనే..!?
టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి గత కొన్ని రోజులుగా ఇంటికే వెళ్లడం లేదట. మరి మనోడు ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నాడు అని ఆరాతీస్తే సెకండ్ సెటప్ తోనే రాత్రింభవళ్లు వర్కౌట్లు చేస్తున్నాడు. ఆగండాగండీ...సెకండ్ సెటప్ అనగానే ఇంకేదో డబుల్ మీనింగ్ రూట్లో ఆలోచించొద్దు సుమీ. మన రాజమౌళికి మొదటి సెటప్ ఇల్లయితే....ఆయన ఏ సినిమా సెట్ లో ఉంటే అదే ఆయన సెకండ్ సెటప్. ప్రొఫెషన్ ను అమితంగా ప్రేమించే రాజమౌళి దాని పట్ల చాలా క్రమశిక్షణగా, నిబ్బద్దతతో, అంకిత భావంతో పని చేస్తారు. అలా ఉండబట్టే ఆయన అనతి కాలంలోనే ఈ రేంజ్ కు ఎదిగారు.
ప్రస్తుతం 'ఈగ' సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రాజమౌళి...దాని సక్సెస్ కోసం చాలానే కష్టపడుతున్నాడు. సినిమా షూటింగ్ ఈ మధ్య ఎక్కువగా రాత్రి వేళల్లోనే ఉంటుండటంతో......కొన్ని వారాలుగా ఇంటి మొహమే చూడటం మానేశాడని సమాచారం. తన కెరియర్లోనే ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈగ సినిమాను తెరకెక్కిస్తున్న ఆయన ఈ సినిమాను ఒక అద్భుతమైన విజువల్ అద్భుతంగా మలిచేందుకు చాలా కసరత్తు చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరుగని రాజమౌళి ఈగ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక సెన్నేషన్ కు తెర తీయడం ఖాయం అంటున్నారు. మరి రాజమౌళి ఆ అంచనాలను ఏమేరకు రీచ్ అవుతాడో చూడాలి. ఈ సినిమాలో నటిస్తున్న నాని, సమంతలు కూడా 'ఈగ'పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











