మెగా, నందమూరి అభిమానులకు షాక్.. RRR వాయిదా!
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా RRR. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతోన్న ఈ మల్టీస్టారర్ సినిమా కోసం మెగా, నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2020 సంవత్సరం జులై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లుగా షూటింగ్ ప్రారంభానికి ముందే చెప్పారు జక్కన్న.
కానీ తాజా పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే RRR మూవీ జులై 30వ తేదీన విడుదల కావడం కష్టమే అని తెలుస్తోంది. అనుకున్న ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదలవుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ సినిమా కోసం హీరోలు ఎన్టీయార్, రామ్‌చరణ్ వచ్చే ఏడాది మే నెల వరకు డేట్లు కేటాయించారట. ఈ లెక్కన్న అప్పటిదాకా షూట్ జరుగుతూనే ఉంటుందన్న మాట.

సాధారణంగా రాజమౌళి సినిమా అంటే గ్రాఫిక్స్ వర్క్స్ పై ప్రత్యేక శ్రద్ద పెడతారు. పైగా RRR భారీ బడ్జెట్ సినిమా కాబట్టి దీనికోసం మరింత కేర్ తీసుకోనున్నారట రాజమౌళి. సో షూటింగ్ పూర్తయ్యాక కనీసం నాలుగైదు నెలలు అయినా గ్రాఫిక్స్ వర్క్ జరగాల్సి ఉంటుంది. కాబట్టి అనుకున్న ప్రకారం జూలై 30న సినిమాను విడుదల చేయడం సాధ్యపడకపోవచ్చు అనేది విశ్లేషకుల మాట.
ఇదిలా ఉంటే ఇటీవలే RRR టీమ్ ఇచ్చిన ఓ ప్రకటనలో విడుదల 2020 అని మాత్రమే ప్రకటించారు. డేట్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి అనుకున్న ప్రకారం పనులన్నీ పూర్తయితే జూలై 30న విడుదలవుతుందని, లేకపోతే దసరాకు వాయిదా పడొచ్చని టాక్ మొదలైంది. ఒకరకంగా ఇది మెగా, నందమూరి అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు మరి.


Click it and Unblock the Notifications











