SSMB29 Movie: ఒక సీన్ కూడా లీక్స్ కాకుండా జక్కన్న జాగ్రత్తలు.. మహేష్ బాబే కాదు వాళ్లు కూడా లాక్..

SSMB29 Movie: సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) కాంబోలో భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. 'ఎస్‌ఎస్‌ఎంబీ29' వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్ ప్రారంభించారు. ఈ మూవీలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తున్నారట. ఇటీవల మహేశ్‌బాబు పాస్‌పోర్ట్‌ను రాజమౌళి స్వాధీనం చేసుకున్నారంటూ వార్తలు రావడంతో ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్‌ కూడా మొదలు పెట్టినల్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారంట.

సాధారణంగానే రాజ‌మౌళి సినిమా అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అలాంటి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా అంటే ఒక్కసారిగా మూవీపై అంచ‌నాలు పెరిగాయి. ఈ సినిమా కోసం మ‌హేష్ త‌న లూక్‌ని మార్చేశారు. పొడ‌వాటి జుట్టుతో జుంపాలు పెంచుకుని.. చాలా హాండ్‌స‌మ్‌గా క‌నిపిస్తున్నారు. ఇక యాక్షన్‌ అడ్వెంచర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులకే కాదు.. గ్లోబల్ వైడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహేష్‌ బాబు - రాజమౌళి కాంబో మూవీ SSMB29 రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరిగిన ఈ మూవీకి సంబంధించిన పూజ కార్యక్రమం ఇటీవల జరిగింది.

Rajamouli s strict instructions for the team of SSMB29

తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైందనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా కూడా జాయిన్‌ అయ్యారట. అలాగే.. మరోవైపు మ‌ళ‌యాల స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమార‌న్ ప్రతినాయకుడుగా న‌టిస్తున్నాడ‌నే టాక్ న‌డుస్తోంది.ప్రస్తుతం.. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య కీలక సన్నివేశాల షూట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కానీ, ఈ మూవీ మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఆఫ్రికా సహా ప్రపంచంలోని పలు దేశాలలో షూటింగ్‌ జరగబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారంట. ఈ భారీ బడ్జెట్ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ. 1000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి భారీ బడ్జెట్ మూవీ నుంచి ఎలాంటి లీక్స్ జరగకుండా డైరెక్టర్
జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ మూవీ సెట్స్‌ నుంచి ఒక చిన్న పిక్‌ కూడా బయటకు రాకుండా డైరెక్టర్ జాగ్రత్త పడుతున్నారట.

గతంలో బహుబలి,ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో అలాంటి తప్పులు జరగకుండా.. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితోనూ మూవీ మేకర్స్ అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారంట. మూవీ టీం మెంబర్స్ నుంచి నాన్‌ - డిస్‌క్లోజ్‌అగ్రిమెంట్లను చేసుకున్నారట. అంటే సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా లో షేర్ చేయడం, ఇతరులతో పంచుకోవడం చేయకూడదు. ఒకవేళ నాన్‌ డిస్‌క్లోజ్ అగ్రిమెంట్‌ని క్రాస్ చేస్తే.. వారిపై భారీ మొత్తంలో ఫైన్‌ విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అగ్రిమెంట్ చేశారట.

అందుకే.. మూవీ పూజ నాడు హీరో మహేశ్ బాబుతో సహా సెట్‌లో ఉన్న వారెవరూ ఫోన్‌లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారట. అందుకే అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన పూజ కార్యక్రమానికి సెట్ పరిధిలోకి కెమెరాలను సైతం అనుమతించలేదట. సెట్స్ నుంచి మొదలుకుని ఎడిటింగ్‌ రూం, వీఎఫ్ఎక్స్ స్టూడియోల నుంచి సినిమాలు లీక్ అవుతున్న విషయం తెలిసిందే. అందుకే రాజమౌళి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సినిమా నుంచి చిన్న లీక్ కూడా కాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

More from Filmibeat

Read more about: mahesh babu rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X