For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR టీమ్‌కు క్లాస్ పీకిన జక్కన్న.. ఆ విషయంలో ఊరుకోనని వార్నింగ్!

  |

  బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కీర్తి సంపాదించిన రాజమౌళి ఆ సినిమా తర్వాత ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఆర్ఆర్ఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే .

  సూపర్ స్టార్ క్రేజ్

  సూపర్ స్టార్ క్రేజ్


  ప్రభాస్ తో బాహుబలి పార్ట్ వన్, పార్ట్ టు చేసి రిలీజ్ చేసిన రాజమౌళి ఆ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాల దెబ్బకి తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా ఎలా అందుకుంది అనే విషయం అందరికీ తెలిసింది. తెలుగు సినిమా ఎందులోనూ తక్కువ కాదని ఈ సినిమా నిరూపించడమే కాక వందల కోట్ల కలెక్షన్లు సాధించి ఇప్పటికి రికార్డులు బద్దలు కొట్టడానికి వీలు లేని స్థాయిలో నిలబడింది. ఈ సినిమా పూర్తయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ అయితే ఇంకా పూర్తి కాలేదు.

  కరోనా ఎఫెక్ట్

  కరోనా ఎఫెక్ట్

  నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయి విడుదలకు కూడా కావాల్సి ఉన్న కరోనా కారణంగా ఈ సినిమా అంతకంతకీ వెనక్కి వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అక్టోబర్ 13వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేసేందుకు యుద్ద ప్రాతిపదికన కష్టపడుతోంది ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్. ఆ తేదీకి సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం ఇప్పటికే ఆర్ఆర్ఆర్ యూనిట్ అంతా కలిసి ఉక్రెయిన్ కూడా వెళ్లారు. ఈ సినిమా యూనిట్ చేసుకుని మళ్ళీ తిరిగి హైదరాబాద్ రానున్నారు.

  రిలీజ్ అవుతుందా?

  రిలీజ్ అవుతుందా?

  అయితే సినిమా షూటింగ్ పూర్తయినా అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయగలరా లేదా అనేదాని మీద ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. ఎందుకంటే మామూలుగానే రాజమౌళి సినిమాలో దాదాపు అన్ని గ్రాఫిక్స్ వర్క్ మీదనే ఆధార పడి ఉంటాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి షూటింగ్ పూర్తి చేసి అదంతా గ్రాఫిక్స్ వాళ్ళకి ఇచ్చినా వాళ్లకు సరైన సమయానికి పూర్తి చేసి సినిమా రిలీజ్ చేసేందుకు సహాయపడతారా లేదా అనే దాని మీద ఇప్పటికే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  అంతకంతకూ అంచనాలు

  అంతకంతకూ అంచనాలు

  ఇక ఆ సంగతి పక్కన పెడితే రాజమౌళి కేవలం ఒక ఫిల్మ్ మేకర్ గానే కాకుండా మార్కెటింగ్ అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా ఒక తిరుగులేని వ్యక్తి అని చెప్పక తప్పదు. ఆయన మార్కెటింగ్ ప్రమోటింగ్ దెబ్బ వలనే బాహుబలి సినిమా అంత క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా ఆయన సినిమా మీద దృష్టి పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ తో పాటు ఒక పక్క నందమూరి వంశానికి చెందిన ఎన్టీఆర్ మరోపక్క మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ తేజ నటిస్తుండడంతో ఈ సినిమా మీద అంచనాలు అయితే అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి.

  నిర్మాణ సంస్థకు అమ్మేసినా

  నిర్మాణ సంస్థకు అమ్మేసినా

  ఇక ఈ అంచనాలు పెరగడంతో పాటు మార్కెట్ కూడా పెరుగుతోంది. దీంతో ప్రీ రిలీజ్ కూడా గట్టిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిజానికి ఈ సినిమా హక్కులు ఎప్పటికీ హోల్సేల్గా బాలీవుడ్ కి చెందిన ఒక నిర్మాణ సంస్థకు అమ్మేశారు. అయితే ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఆ సంస్థ రాజమౌళి ముందు ఉండి నడిపించి తీరాల్సిందేనని కోరినట్లు తెలుస్తోంది. వారికి మాట ఇచ్చిన రాజమౌళి కచ్చితంగా ఈ సినిమాను మునుపెన్నడూ లేని విధంగా ప్రమోట్ చేస్తానని కూడా చెప్పారట.

  నో కామెంట్స్

  నో కామెంట్స్

  అందుకే ఈ సినిమా విషయంలో ఎక్కడా సినిమాలోని నటీనటులు కానీ ఇతర టెక్నీషియన్స్ కూడా బయట మీడియాతో మాట్లాడవద్దని రాజమౌళి కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ మీడియాతో మాట్లాడాల్సి వచ్చినా సినిమాకి సంబంధించి ఎలాంటి విషయాలు ఎక్కడా మాట్లాడవద్దని స్టార్ నటీనటులు సూచనలు చేశారట. అలాగే యూనిట్లో టెక్నీషియన్స్ కోశాన్ అయితే ఏకంగా క్లాస్ తీసుకున్నారని ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళినా ఊరుకునేది లేదని వారికి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. గతంలో సినిమా షూటింగ్ కు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సెట్ నుంచి లీక్ కాగా ఆ తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా రాజమౌళి పర్యవేక్షిస్తూ నుంచి ఎలాంటి లీకేజీలు లేకుండా చూశారు.

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
  నోరుమెదిపే పని లేదు

  నోరుమెదిపే పని లేదు

  ఇప్పుడు కూడా అదే పద్ధతి ఫాలో అవుతూ తాను అనుకున్న యాక్షన్ ప్లాన్ పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఏకంగా రాజమౌళి నుంచి నేరుగా సూచనలు రావడంతో అటు స్టార్ నటీనటులు, ఇటు టెక్నీషియన్స్ కూడా తమ సన్నిహితులతో కూడా ఏమీ ఈ విషయం గురించి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రాజమౌళి ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగుతారని అప్పటి వరకు ఆ తర్వాత కూడా సినిమాకు సంబంధించి ఆయన మినహా మిగతా ఎవ్వరూ కూడా నోరుమెదిపే పని లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందనేది.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటో గ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంబంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.  English summary
  Rajamouli is well known for his marketing and promotions as well. so as per latest reports Rajamouli has asked the cast and crew of RRR not to discuss any aspect of the film with the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X