చంద్రబాబు పాదయాత్రకు రాజమౌళి టిప్స్ ఏమిటి?
ఇంతకీ రాజమౌళి చెప్పిన టిప్స్ ఏమటీ...అంటే లెంగ్తీ ఉపన్యాసాలు వద్దన్నారట. చిన్నగా,డైరక్ట్ గా పాయింట్ లోకి వచ్చే ఉపన్యాసాలకే ప్రాధాన్యత ఇవ్వమన్నారట. అలాగే చంద్రబాబు ట్రేడ్ మార్క్ అయిన రెండు వేళ్లు (V) చూపెట్టడం కన్నా నమస్కారం పెట్టమన్నారట. ఈ టిప్స్ చంద్రబాబుకి మంచి మైలేజే తెస్తున్నాయంటున్నారు. అయితే 'నేను చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ చేయడమా?(దానర్థం ఏమిటి?), నేను ఆయనకు టిప్స్ ఇచ్చాననే వార్తలు పూర్తిగా అవాస్తవం' అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు.
రాజమౌళి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో తాను తీయబోయే చిత్రం స్క్రిప్టు వర్క్ లో బిజీగా ఉన్నారు. తాజాగా రాజమౌళి తన చిత్రం ఫోక్ స్టోరీలా ఉంటుందని,చారిత్రకం కాదని మిడియాకు తెలియచేసారు. మరో ప్రక్క తెలుగు,హిందీ భాషల్లో చేస్తానంటున్నారు. వీటిన్నటితో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపద్యంలో ఈ చిత్రం బడ్జెట్ అరవై కోట్ల రూపాయలనే విషయం బయిటకు వచ్చింది. మేజర్ గా ఈ చిత్రం కోసం భారీ సెట్స్, గ్రాఫిక్స్ ఖర్చు పెట్టనున్నారని సమాచారం.
ఇక ఈ చిత్రం బాలీవుడ్ కి కనెక్టు అవుతుందా అంటే...ఎందుకు కాదు అంటున్నారు రాజమౌళి. ఆయన ..ఈ చిత్రం హీరో సెంట్రిక్ కాదని, ప్రభాస్ ఓ లీడింగ్ మ్యాన్ అని అంటున్నారు. అంటే మరో వెండితెర అద్బుతం జరగబోతోందనే సూచనలు ఇస్తున్నట్లే. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు. వారు గతంలో రాజమౌళి తో మర్యాదరామన్న చిత్రం తీసారు. నవంబర్ నుంచి ఈ చిత్రం ప్రారంభం కానున్నదని సమాచారం. ఈ చిత్రం కోసం తాను పెళ్లిని సైతం వాయిదా వేసానని ప్రబాస్ చెప్తున్నారు.


Click it and Unblock the Notifications












