ఆ మ్యాటర్ తెలియక RRR సీక్రెట్ లీక్ చేసిన హీరోయిన్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి!

ఎలాంటి సినిమా అయినా సరే థియేటర్స్ కి వచ్చే వరకు ఎలాంటి సీక్రెట్స్ బయటకు రావద్దని చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరు జాగ్రత్త పడుతుంటారు. ముఖ్యంగా దర్శకుడు సినిమాకు సంబంధించిన కొన్ని అతి ముఖ్యమైన విషయాల్ని గోప్యంగా ఉంచుతారు. ఇకపోతే ఇటీవల RRR విషయంలో జక్కన్న వేసిన ప్లాన్ మొత్తం శ్రీయ చెడగొట్టినట్లు తెలుస్తోంది. అందుకు రాజమౌళి ఆగ్రహం వ్యక్తం చేశారట. అందుకు ఒక కారణం కూడా ఉంది.

Recommended Video

RRR Movie Update : SS Rajamouli Serious On Shriya Saran
ఆ విషయం బాగా తెలుసు..

ఆ విషయం బాగా తెలుసు..

తన సినిమాల విషయంలో దర్శకుడు రాజమౌళి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక సినిమా అనుకున్నట్లు రావడానికి ఎన్ని రోజులైనా కష్టపడతారు. అయితే ఎప్పుడు ఎలాంటి విషయాలని జనాలకు చెప్పాలి అనే విషయం కూడా ఆయనకు బాగా తెలుసు. వీలైనంత వరకు సినిమాకు సంబంధించిన సీక్రెట్స్ ని బయటపెట్టరు.

వాళ్ళు కూడా చెప్పలేదు..

వాళ్ళు కూడా చెప్పలేదు..

చాలా వరకు రాజమౌళి తన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి తనే అఫీషియల్ గా బయటకు చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న RRR విషయంలో అయితే దర్శకుడు చాలా జాగ్రత్తగా ప్రైవసీని మెయింటైన్ చేస్తున్నారు. స్టార్ హీరోలు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా గురించి ఎలాంటి విషయాన్ని చెప్పలేదు.

శ్రీయ చెప్పేసింది..

శ్రీయ చెప్పేసింది..

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గాన్‌ కూడా రాజమౌళి కండిషన్స్ ని గౌరవించి బాలీవుడ్ మీడియా ఎంత అడిగినా ఒక్క సీక్రెట్ కూడా కూడా బయటపెట్టలేదు. కానీ శ్రీయ సరన్ మాత్రం చెప్పరాని ఒక విషయం గురించి బయట చెప్పేసింది. అసలైతే కొంత మంది నటీనటుల గురించి సినిమా రిలీజ్ వరకు బయట చెప్పకూడదని రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడు. ముఖ్యంగా అజ‌య్ పాత్రకు జోడి ఎవరనే విషయం చెప్పొద్దని అనుకున్నారు.

 ప్లాన్ చెడగొట్టేసింది..

ప్లాన్ చెడగొట్టేసింది..

సినిమాకు సైన్ చేసిన రోజే రాజమౌళి శ్రీయకి చాలా క్లియర్ గా చెప్పారట. ఈ విషయం సీక్రెట్ గా ఉంటేనే బెటర్ అని. ఎందుకంటే అజ‌య్ దేవ‌గాన్‌ హీరోకు జోడి అంటే ప్రస్తుతం శ్రీయ ఉన్న రేంజ్ ఎంతవరకు జనాలకు కనెక్ట్ అవుతుందో తెలియదు. కానీ సినిమా రిలీజ్ అనంతరం పాత్రను బట్టి కనెక్ట్ అవుతారని అప్పటి వరకు ఆ మ్యాటర్ బయటకు రాకూడదని అనుకున్నారు.

 రాజమౌళి ఆగ్రహం..

రాజమౌళి ఆగ్రహం..

కానీ శ్రీయ ఆ విషయం గురించి పట్టించుకోకుండా సినిమాలో అజయ్ కి జోడిగా నటిస్తున్నాను అని చాలా క్లియర్ గా చెప్పేసింది. దీంతో RRR దర్శకుడు రాజమౌళి కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఇప్పటికే కొన్ని పాత్రల గురించి చెప్పిన జక్కన్న శ్రీయ గురించి చెప్పలేదు అంటే కచ్చితంగా ఎదో సీక్రెట్ ఉండే ఉంటుంది. ఆ విషయం గురించి పట్టించుకోకుండా అమ్మడు ఈ విదంగా లీక్ చేయడం కరెక్ట్ కాదనే అంటున్నారు సినీ జనాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X