లాంగ్ గ్యాప్: మెగా ఫ్యామిలీ హీరోతో రాజమౌళి సినిమా!
హైదరాబాద్: మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' చిత్రం తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వల్ల రామ్ చరణ్ కెరీర్ ఒక్కసారిగా రాకెట్‌లా దూసుకెళ్లింది.
2009లో మగధీర సినిమా విడుదైలైంది. ఆ తర్వాత రాజమౌళి మళ్లీ మెగా ఫ్యామిలీ హీరోలెవరితోనూ సినిమా చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి త్వరలోనే నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్‌తో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల నాగబాబు రాజమౌళికి ఫోన్ చేసి వరుణ్ తేజ్ కోసం మంచి కథ తయారు చేయాలని, తన కొడుకును పరిశ్రమలో స్టార్ హీరోగా నిలబెట్టేలా సినిమా తీయాలని కోరాడట. ఇందుకు రాజమౌళి సుముఖంగా స్పందించారని, బాహుబలి పూర్తయిన తర్వాత ఆ విషయమై దృష్టి సారిస్తానని చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం వరుణ్ తేజ్ 'గొల్లభామ' చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన కన్నడ భామ పూజా హెడ్గే నటిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడని సమాచారం. బ్రహ్మానందం,ప్రకాష్ రాజ్, నాజర్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా రూపొందబోతోంది. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు. 'కొత్తబంగారులోకం',' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో వరుణ్‌తేజ్ తొలి చిత్రంపై మంచి అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











