బాలయ్యతో మహదేవన్ సినిమా లేనట్టేనా?

By Staff

Balakrishna
ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో నలుగుతున్న హాట్ టాపిక్ ఇదే. రాజమౌళి శిష్యుడు మహదేవన్ ఒక్క సినిమా కూడా చెయ్యకుండానే పరిశ్రమ వర్గాల నోళ్ళల్లో నానుతున్నాడు. కారణం పిల్లి పిల్లల్ని పెట్టి యేడిళ్ళు తిప్పినట్లు ఒకే సబ్జెక్టును అందరి హీరోలుకు వినిపిస్తున్నాడని సమాచారం. అతను తయారు చేసిన 'క్షత్రియుడు' స్క్రిప్టు మొదట ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకుని చేసానని దిల్ రాజు ద్వారా అతన్ని కలిసాడు. కాని వర్కవుట్ కాలేదు. తర్వాత ఇది పర్ ఫెక్ట్ గా బాలకృష్ణకు సూటవుతుందని అక్కడకెళ్ళాడు.

మొదట బాగుంది అదే సినిమా చేస్తాడన్న బాలయ్య మరెందుకు రిజెక్టు చేసారో గాని అది ఇప్పుడు ప్రభాస్ క్యాంపస్ కెళ్ళి చేరింది. అది ఆ హీరోకు పిచ్చ పిచ్చ గా నచ్చిందని సమాచారం. అంటే టైటిల్ 'క్షత్రియుడు' బాగా ఎక్ట్రాక్ట్ చేసుంటుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అదెలా ఉన్నా త్వరలోనే ప్రభాస్ దీన్ని ప్రారంభించనున్నాడని తెలుస్తోంది. అదీ తమ గోపీకృష్ణ బ్యానర్ పైనట. అంటే బాలకృష్ణ తో మహదేవన్ సినిమా లేనట్టేగా అంటున్నారు సీనియర్లు.

అలాగే ప్రభాస్ కి తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ తో వచ్చే సంవత్సరం సినిమా ఉంది. అలాగే రాజమౌళి సినిమా కూడా ఉంది. గ్యాప్ లో ఈ సినిమా లాగించేస్తారట. ఇక బాలయ్య ఇప్పటికీ తరువాత ప్రాజెక్టుకి దర్శకుడిని కనఫర్మ్ చేయలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X