RRR సీక్వెల్‌లో ఊహించని ట్విస్ట్.. దర్శకుడిగా ఆ ఇద్దరి పేర్లు.. అసలు తారక్-చరణ్ ఒప్పుకుంటారా?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రతిఒక్కరికీ తెలిసిందే. అయితే ఈ చిత్ర సీక్వెల్ కు రాజమౌళి దర్శకత్వం వహించరని, ఆయన కొడుకు కార్తికేయ డైరెక్ట్ చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అలానే జక్కన్న కాకుండా ఇతర దర్శకులు ఈ సీక్వెల్ తీస్తే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ డేట్స్ ఇస్తారా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వివరాళ్లోకి వెళితే..
పాన్ ఇండియా కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రచయితల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి. 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' సహా పలు వైవిధ్యభరిత కథలను అందించారు. అవన్నీ ఆయన కలం నుంచి వచ్చినవే. అయితే జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా జక్కన్న తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్' దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇండియా వైడ్ గా దాదాపు రూ.1000కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. దీంతో అభిమానులు ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుండని ఆశించారు.

రాజమౌళి కాదట.. :అభిమనులు ఆశించినట్టే 'ఆర్‌ఆర్‌ఆర్'కు సీక్వెల్ ఉంటుందని ఆ మధ్యలో విజయేంద్ర ప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే. మధ్యమధ్యలో ఒకటి రెండు సార్లు ఈ సీక్వెల్ పనులు ఎక్కడి వరకు వచ్చాయో కూడా చెప్పారు. అయితే ఇటీవలే తాజా ఇంటర్వ్యూలో మాత్రం బాంబు పేల్చారు. సీక్వెల్ కు రాజమౌళి దర్శకత్వం వహించకపోవచ్చని అన్నారు. జక్కన్నకు ఉన్న కమిట్ మెంట్స్ వల్ల అది సాధ్యం కాదని అన్నారు. ఓ హాలీవుడ్ సంస్థకు ఈ సీక్వెల్ బాధ్యతలు అప్పగించవచ్చని అన్నారు.
కార్తికయ దర్శకత్వంలో.. :విజయేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు అన్నాక సీక్వెల్ కు డెరెక్టర్ గా రాజమౌళి కొడుకు కార్తికేయ ఉండొచ్చని వార్తలు వినిపించాయి. ఎందుకంటే తొలి భాగానికి సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి బాగా సహకరించింది కార్తికేయనే. సినిమా మార్కెట్ ను అంతా ఆయనే చూసుకున్నారు. వెనక ఉండి సినిమాను నడిపించారు. అసలీ చిత్రం ఆస్కార్ వరకు వెళ్లడానికి ముఖ్య కారణం ఆయనే అని చెబుతున్నారు. మరి ఈ కారణంగానో లేదా ఇతర కారణాల వల్లనో ఇప్పుడు సీక్వెల్ దర్శకత్వ బాధ్యతలను కార్తికేయపై జక్కన్న పెట్టబోతున్నట్లు రెండు మూడు రోజులుగా బాగా ప్రచారం సాగుతోంది.

బ్రహ్మాస్త్ర దర్శకుడి పేరు.. :అయితే ఇప్పుడు తెరపైకి మరో పేరు కూడా వచ్చింది. అదేంటంటే.. కార్తికేయ వద్దంటే.. బ్రహ్మాస్త్ర సినిమా తెరకెక్కించి దేశవ్యాప్తంగా హిట్ అందుకున్న అయాన్ ముఖర్జీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన వార్ 2 తెరకెక్కించబోతున్నారు. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర రెండు మూడు భాగాలు కూడా తెరకెక్కించనున్నారు. మరి ఈ బిజీ షెడ్యూల్ లో ఆయన ఈ సినిమాను టేకప్ చేస్తారా అన్నది కూడా ఓ ప్రశ్న.
మన హీరోలు అంగీకరిస్తారా... :ఇకపోతే అసలు సమస్య ఇంకోటి ఉంది. సాధారణంగా ఏ హీరో అయినా.. రాజమౌళి దర్శకత్వంలో హీరోగా ఛాన్స్ అంటే టక్కున ఒప్పేసుకుంటారు. కథ కూడా వినాల్సిన పని ఉండదు. ఎందుకంటే అంతటి నమ్మకాన్ని, పాపులారిటినీ సంపాదించుకున్నారు రాజమౌళి. సంవత్సరాల పాటు డేట్స్ కావాలన్నా హీరోల ఇచ్చేస్తారు. అందుకే 'బాహుబలి' కోసం ప్రభాస్, 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ దాదాపు నాలుగు, ఐదేళ్ల పాటు డేట్స్ ఇచ్చేశారు.

మరి ఈ సీక్వెల్ ను తీసుకెళ్లి ఇతర దర్శకుల చేతిలో పెడితే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒప్పుకుంటారా? అనేది మరో పెద్ద ప్రశ్న. జక్కన్న కాకుండా ఇతర దర్శకులు దీన్ని తెరకెక్కించేందుకు ముందుకు వస్తే ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమ డేట్స్ ను ఇస్తారా? అసలు సినిమా చేయడానికి ఆసక్తి చూపుతారా? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా అలాగే ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి అసలు ఈ సీక్వెల్ కార్యరూపలం దాలుస్తుందో లేదో. ఒకవేళ సెట్స్ పైకి వెళ్తే ఎవరు దర్శకత్వం వహిస్తారో? రామ్ చరణ్ ఎన్టీఆర్ అంగీకరిస్తారో లేదో..


Click it and Unblock the Notifications











