షాకింగ్ న్యూస్...RRR సీక్వెల్ డైరెక్టర్ రాజమౌళి కాదట..ఎవరు డైరెక్ట్ చేయనున్నారంటే?

RRR (ఆర్ఆర్ఆర్).. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినమాకు సీక్వెల్ రాబోతుందంటూ.. ఈ మధ్య కథనాలు వెలువడ్డాయి. దానికి కారణం ఈ సినిమా కథకుడు విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలో సీక్వెల్ ఉండబోతుందని అన్నారు. అయితే ఈ సీక్వెల్ కు రాజమౌళి దర్శకుడు కాదట.. ఆ వివరాల్లోకి వెళితే...

సీక్వెల్ కు రాజమౌళి డైరెక్టర్ కాదు: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అంటేనే ఒక స్టాంప్. ఆయన నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా సూపర్ హిట్ అవ్వాల్సిందే అనే సెంటిమెంట్ అందరిలో బలంగా నాటుకుపోయింది. అలాంటి ఆయన చివరిగా ఆర్ఆర్ఆర్ అనే సినిమా డైరెక్ట్ చేశారు.

Rajamoulis son Karthikeya will direct the sequel of RRR movie news viral in social media

ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి తెలుగు నటీనటులకి మంచి గుర్తింపు దక్కేలా చేసింది. అంతేకాక ఏకంగా ఆస్కార్ బరిలో నిలవడమే కాదు.. రెండు ఆస్కార్ అవార్డులు కూడా సాధించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు రాజమౌళి. అయితే ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందని కానీ డైరెక్టర్ మాత్రం రాజమౌళి కాదని అంటున్నారు.

మరి ఎవరు ఆ డెైరెక్టర్: అసలు విషయం ఏమిటంటే... ఆర్ఆర్ఆర్ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ఈ మధ్యకాలంలో రాజమౌళి తండ్రి ఆర్ఆర్ఆర్ కథకుడు విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఆయన చెప్పడం బాగానే ఉంది. కానీ అక్కడ ఒక మెలిక పెట్టారు. అది ఏంటంటే ఆర్ఆర్ఆర్ సినిమాకి సీక్వెల్ ఉంటుంది. అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తారు. అయితే డైరెక్షన్ మాత్రం రాజమౌళి చేయడం లేదు... అని అర్థం వచ్చేలా ఆయన కామెంట్లు చేశారు.

Rajamoulis son Karthikeya will direct the sequel of RRR movie news viral in social media

రాజమౌళి కుటుంబ సభ్యుడే: అయితే రాజమౌళి కాబట్టి విషయం ఉన్నా లేకపోయినా చెక్కి చెక్కి ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా మలుస్తారు. కానీ ఆయనలాగా ఈ రెండో భాగాన్ని తీర్చి చేయగలిగిన వారెవ్వరు అనే విషయం మీద చర్చ జరుగుతోంది. అయితే ఆ చర్చల్లో వినిపిస్తున్న ఒక పేరు హార్ట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఆ పేరు ఇంకెవరితో కాదు.. . రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ రెండో భాగాన్ని డైరెక్ట్ చేస్తాడని వాదన వినిపిస్తోంది.

Rajamoulis son Karthikeya will direct the sequel of RRR movie news viral in social media

కార్తికేయ చేయగలడా: ఎందుకంటే ఆర్ఆర్ సినిమా సెకండ్ యూనిట్ కి కార్తికేయ దర్శకుడు అనే విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. ఆ తర్వాత ఆస్కార్ వరకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రయాణం సాగడం వెనుక కూడా కార్తికేయ ప్రమేయం ఉందని ఏకంగా ఆస్కార్ వేదిక మీదే కీరవాణి వంటి వారు కూడా నొక్కి వక్కాణించారు. ఇక ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సెకండ్ పార్ట్ దర్శకత్వ బాధ్యతలు ఆయన అయితే దానికి కచ్చితంగా న్యాయం చేయగలడని జక్కన్న ఎంతో భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Rajamoulis son Karthikeya will direct the sequel of RRR movie news viral in social media

రెస్ట్ మోడ్ లో రాజమౌళి: ఇక మరో పక్క రాజమౌళి మహేష్ బాబు సినిమాకి సంబంధించిన పనిలేవి మొదలు పెట్టలేదని తెలుస్తోంది. ఈ మధ్యనే తమిళనాడు వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు అన్నింటిని సందర్శించి వచ్చిన ఆయన ఇప్పుడు మరి కొంచెం రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక మహేష్ బాబు సినిమా మీద పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టి కథ పూర్తి చేసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టి ఆ తర్వాత షూట్ కి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X