Just In
- 5 min ago
నా ప్రపంచమే అతను.. కొద్దిరోజుల్లోనే మీ ముందుంచబోతున్నా: రాశిఖన్నా
- 46 min ago
కుమ్మేసిన వెంకీమామ.. తొలి వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్.. ఎంత రాబట్టిందో తెలుసా?
- 1 hr ago
నాగబాబు అందుకే జంప్.. బయటపడిన అసలు సీక్రెట్! హాట్ టాపిక్..
- 1 hr ago
ఏ సందర్భంలోనైనా నాకు అండగా ఉన్నది వాళ్ళే.. మెగా మేనల్లుడి కామెంట్స్
Don't Miss!
- News
నా బిడ్డ బతికి లేకపోవడం సంతోషం.. ఆ మృగాళ్లను చూసినప్పుడల్లా చస్తున్నా.. నిర్భయ తల్లి కంటతడి
- Sports
అతడిని కనుక్కోండి, 18 ఏళ్ల నాటి సంఘటనపై: ట్విట్టర్లో నెటిజన్లకు సచిన్ సూచన
- Finance
ఏపీలో ఆర్టీసీ విలీనం: పెన్షన్ పథకం ఇక మీ ఇష్టం, ఆ డబ్బు కూడా కార్మికులకే!
- Lifestyle
మార్నింగ్ వర్కవుట్సా లేదా ఈవినింగ్ వర్కవుట్సా? రెండింటిలో ఏది బెటరో తెలుసా..?
- Technology
మోటరోలా రేజర్ ఫోల్డబుల్ ఫోన్ త్వరలో ఇండియాలో రిలీజ్
- Automobiles
2020 సుజుకి హయాబుసా విడుదల: ధర రూ. 13.75 లక్షలు
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
జక్కన్న సరికొత్త ఫార్ములా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరినీ వదలడం లేదట! మెగా అప్డేట్
బాహుబలి తర్వాత మరో భారీ సినిమాకు ముహూర్తం పెట్టారు దర్శక ధీరుడు రాజమౌళి. RRR అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నారు జక్కన్న. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడమే టార్గెట్‌గా చకచకా షూటింగ్ పూర్తి చేస్తున్నారు రాజమౌళి. ఈ మేరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరిపై కీలక సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా ఓ ఫార్ములా ఫాలో అవుతున్నారట. ఆ వివరాలు చూద్దామా..

ముందుగానే ఫిక్స్ చేసి..
RRR సినిమాను 2020 జూలై 30న విడుదల చేస్తామని చిత్ర షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రకటించారు రాజమౌళి. అందుకు తగ్గట్టుగానే వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేస్తూ త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. హీరోలు రామ్ చరణ్, తారక్ ఒకరి తర్వాత ఒకరు గాయపడడం, తన వ్యక్తిగత విషయాల కోసం విశ్రాంతి తీసుకోవడం కారణంగా కాస్త ఆలస్యం కావడంతో ఆ గ్యాప్ కవర్ చేసేలా సరికొత్త ఫార్ములా అవలంభిస్తున్నారట రాజమౌళి.

పగలు రామ్ చరణ్, రాత్రి ఎన్టీఆర్
ప్రస్తుతం RRR షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. అయితే ఇక్కడ పగటి పూట రామ్ చరణ్‌తో షూటింగ్ చేస్తున్న జక్కన్న.. రాత్రిళ్లు జూనియర్ ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. విడుదలకు సమయం దగ్గర పడుతున్న కారణంగా ఉన్న కొంచెం సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా జక్కన్న ఇలా ప్లాన్ చేశారట.

ఎన్టీఆర్‌కు విశ్రాంతి.. ఆ వెంటనే
ఇక ఈ షెడ్యూల్ పూర్తి కాగానే ఎన్టీఆర్‌కు కొన్ని రోజులు విశ్రాంతి ఇస్తారని తెలిసింది. ఈ సమయంలో కోకాపేట్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో రామ్ చరణ్‌తో ఒక షెడ్యూల్ షూట్ చేయనున్నారని సమాచారం. మొత్తానికి అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని జక్కన్న పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నారని టాక్.

రంగంలోకి బాలీవుడ్ స్టార్స్
భారీ బడ్జెట్‌తో బహుబాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రలు పోషిస్తుండటం విశేషం. అలాగే, తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో RRR రూపొందుతోంది.

కీలక అప్డేట్.. టైమ్ వచ్చేసింది
RRR చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ చరణ్ నటిస్తుండగా, కొమురం భీం రోల్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రామ రౌద్ర రుషితం' అనే ఆసక్తికర టైటిల్ పరిశీలిస్తున్నారని తెలిసింది. మరికొద్ది రోజుల్లోనే RRR నుంచి కీలక అప్డేట్ రానుందని ఫిలింనగర్ టాక్.