RRR: రాజమౌళి స్ట్రాంగ్ వార్నింగ్.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లనూ వదలని జక్కన్న!

గత రెండు మూడు రోజులుగా RRR ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది. RRR సెట్స్ నుంచి ఎన్టీఆర్ లుక్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకురావడంతో ఈ అంశం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలా లీకయ్యాయి? ఎవరు లీక్ చేశారు? అనే దానిపైనే చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి RRR టీమ్ మొత్తానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

ఎన్టీఆర్ కొమురం భీం లుక్.. నెట్టింట వైరల్

ఎన్టీఆర్ కొమురం భీం లుక్.. నెట్టింట వైరల్

RRR మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొమురం భీం పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ ఒక్క లుక్ కూడా రిలీజ్ చేయలేదు రాజమౌళి. ఇంతలో సడెన్‌గా సెట్స్‌పై ఎన్టీఆర్ షూటింగ్‌కి సంబంధించిన కొన్ని లుక్స్ నెట్టింట ప్రత్యక్షమై వైరల్ కావడంతో అంతా షాకయ్యారు.

సీరియస్‌గా ఆరా తీస్తున్న రాజమౌళి

సీరియస్‌గా ఆరా తీస్తున్న రాజమౌళి

ఇలా ఎన్టీఆర్ షూటింగ్ స్టిల్ లీక్ కావడంపై రాజమౌళి ఫుల్ సీరియస్‌ అయినట్లు సమాచారం. అసలు ఆ స్టిల్ ఎలా లీకైంది? అప్పుడు సెట్‌లో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆయన చాలా సీరియస్‌గా ఆరా తీస్తున్నారని టాక్. అంతేకాదు ఇకపై ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు సెట్‌లో స్పెషల్ టీమ్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట జక్కన్న.

తన పర్మిషన్ లేకుండా.. రాజమౌళి రూల్స్

తన పర్మిషన్ లేకుండా.. రాజమౌళి రూల్స్

షూటింగ్‌ జరుగుతున్న సమయంలో సెట్స్ పైకి మొబైల్స్‌తో పాటు ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలు తీసుకురాకుండా ఈ స్పెషల్ ఓ కన్నేసి ఉంచుతుందట. ఈ మేరకు రూల్స్ పాస్ చేశాడట రాజమౌళి. అంతేకాదు తన పర్మిషన్ లేకుండా షూటింగ్ స్పాట్ లోకి ఏ ఒక్కరూ లోపలికి రాకూడదని చెప్పారట జక్కన్న. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ సహా ఎవరికీ మినహాయింపు ఇవ్వకూడదని ఆయన డిసైడ్ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

రాజమౌళి స్కెచ్.. పాన్ ఇండియా మూవీ

రాజమౌళి స్కెచ్.. పాన్ ఇండియా మూవీ

తెలుగుతో పాటు మరో తొమ్మిది భాషల్లో భారీ ఎత్తున RRR సినిమాను విడుదల చేయబోతున్నారు జక్కన్న. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకు సర్వహంగులు జోడించి దేశంలోనే మునుపెన్నడూ చూడనివిధంగా తీర్చిదిద్దాలని ఫిక్స్ అయ్యారట రాజమౌళి. ఇక ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న డీవీవీ దానయ్య కూడా జక్కన్న చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని, భారీ సొమ్ము వెచ్చిస్తున్నారని తెలుస్తోంది.

 'రామ రౌద్ర రుషితం'.. న్యూ ఇయర్ కానుక

'రామ రౌద్ర రుషితం'.. న్యూ ఇయర్ కానుక

ఈ చిత్రానికి 'రామ రౌద్ర రుషితం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. న్యూ ఇయర్ కానుకగా ఈ టైటిల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్

ఎన్టీఆర్, రామ్ చరణ్

RRR మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్‌ నటిస్తోంది. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చెర్రీ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తున్నారు. చారిత్రిక నేపథ్యమున్న సినిమా కావడంతో మెగా, నందమూరి అభిమానులు ఆతృతగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X