'లక్ష్మి కళ్యాణం' సినిమాతో పరిచయమై 'చందమామ' విజయంతో చిరుత ప్రక్కన ఛాన్స్ కొట్టేసిన ముంబాయి భామ కాజల్. ఆమె ఇప్పుడు సునీల్ తో రాజమౌళి తీయబోయే కామిడీ సినిమాలో హీరోయిన్ గా చేయబోతోందని వార్తలు వినపడుతున్నాయి. ఈ లో..బడ్జెట్ సినిమా వచ్చే జనవరిలో స్టార్ట్ అవుతోందని తెలుస్తోంది. యార్లగడ్డ శోభనాద్రి తమ ఆర్కా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. గతంలోనూ సునీల్ హీరోగా చేసిన 'అందాల రాముడు' లో అతని ప్రక్కన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చేసింది. ఇప్పుడూ అలాగే క్రేజీ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందని ఆలోచిస్తున్నారుట. ఇక రాజమౌళి, రామ్ చరణ్ తేజ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమాలోనూ కాజల్ హీరోయిన్. ఆ సినిమా నవంబరులో రిలీజయ్యే అవకాశం ఉంది.