మెగా హీరోల మూవీకి రాజమౌళి మాస్టర్ ప్లాన్: RRR తర్వాత పట్టాలెక్కనున్న మల్టీస్టారర్‌.!

By Manoj Kumar P

సినీ పరిశ్రమలోకి ఎంతో మంది దర్శకులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తుంటారు. కానీ, వారిలో కొందరు మాత్రమే క్లిక్ అవుతారు. అందులోని చాలా తక్కువ మంది అగ్ర దర్శకులుగా పేరొందుతారు. అలాంటి వారిలో దర్శకధీరుడు రాజమౌళి ఒకరు. 'స్టూడెంట్ నెం 1' అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఆయన తక్కువ వ్యవధిలోనే స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక, కొన్నేళ్లుగా భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మెగా హీరోల మూవీ కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్ వేశాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడు

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడు

వందకు వంద శాతం సక్సెస్ రేటు ఉన్న దర్శకుల్లో రాజమౌళి ఒకరు. వరుస విజయాలతో జోరు మీదున్న ఆయన.. కొన్నేళ్ల క్రితం ప్రభాస్ హీరోగా ‘బాహుబలి' అనే సినిమా తీసిన విషయం తెలిసిందే. రెండు భాగాలుగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ మూవీతో తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం అయిపోయింది.

 మరోసారి సత్తా చాటాలని.. ఇద్దరిని కలిపాడు

మరోసారి సత్తా చాటాలని.. ఇద్దరిని కలిపాడు

‘బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రుధిరం రణం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. వీరితో పాటు ఎంతో మంది బడా స్టార్లు కీలక పాత్రలు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది.

దాని ప్రభావంతో దర్శకేంద్రుడి ఆశలు ఆవిరి

దాని ప్రభావంతో దర్శకేంద్రుడి ఆశలు ఆవిరి

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ మొదట్లో ప్రకటించింది. అయితే, అనివార్య కారణాలతో షూటింగ్ పలుమార్లు వాయిదా పడడంతో విడుదల తేదీని జనవరి 8, 2021కి మార్చారు. ఇప్పుడ కరోనా వైరస్ ప్రభావంతో సినిమా మరోసారి వాయిదా పడడం ఖాయమన్న టాక్ బాగా వినిపిస్తోంది.

ఇండస్ట్రీ బాగు కోసం వాళ్లతో కలిసిన జక్కన్న

ఇండస్ట్రీ బాగు కోసం వాళ్లతో కలిసిన జక్కన్న

కరోనా కారణంగా దాదాపు మూడు నెలలుగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పిరియడ్ నడుస్తోంది. దీంతో సినిమా షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో షూటింగులకు అనుమతితో పాటు సినీ కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరేందుకు ఇండస్ట్రీలోని పెద్దలతో కలిసి రాజమౌళి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. 9న ఏపీ సీఎంతోనూ సమావేశం కానున్నారు.

RRR షూటింగ్ షురూ.. చిన్నగా మొదలు

RRR షూటింగ్ షురూ.. చిన్నగా మొదలు

జూన్ 15 నుంచి తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అనుమతి లభిస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే తమ సినిమా షూటింగ్ వెంటనే షురూ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. లాక్‌డౌన్ నిబంధనల మేరకు ముందుగా చిన్న చిన్న సన్నివేశాలను చిత్రీకరించి, పరిస్థితి చక్కబడిన తర్వాత మేజర్ పార్ట్ షూట్ చేయబోతున్నారు.

మెగా హీరోల మూవీకి రాజమౌళి మాస్టర్ ప్లాన్

మెగా హీరోల మూవీకి రాజమౌళి మాస్టర్ ప్లాన్

RRRలో హీరోగా నటిస్తోన్న రామ్ చరణ్... చిరంజీవి హీరోగా చేస్తున్న ‘ఆచార్య'లోనూ కీలక పాత్ర చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో షూటింగ్ వాయిదా పడడం వల్ల చెర్రీ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళి చొరవ తీసుకుని మరీ ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేశాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

Recommended Video

Kannada Actor Chiranjeevi Sarja గుండెపోటుతో మృతి
RRR తర్వాత పట్టాలెక్కనున్న మల్టీస్టారర్‌.!

RRR తర్వాత పట్టాలెక్కనున్న మల్టీస్టారర్‌.!

ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రచారం అవుతోన్న సమాచారం ప్రకారం... షూటింగ్ ప్రారంభమైన వెంటనే రామ్ చరణ్ చేయాల్సిన భాగాన్ని చిత్రీకరించబోతున్నాడట జక్కన్న. ఆ వెంటనే అతడిని రిలీవ్ చేసి ‘ఆచార్య' షూటింగ్‌కు పంపించబోతున్నాడని అంటున్నారు. ఇటీవల జరిగిన భేటీలో తమ సినిమా కోసం చరణ్‌ను పంపాలని చిరంజీవి కోరడం వల్లే జక్కన్న ఈ ప్లాన్ వేశాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X