'ఈగ’కి గ్లామర్ అడ్డోస్తోందని రాజమౌళి టెన్షన్...!
'మగధీర" సినిమాతో ఇండస్ట్రీ షేకింగ్ హిట్టిచ్చిన రాజమౌళి, 'మర్యాదరామన్నతో ఇంకా పెద్ద హిట్ కొడ్తామనుకున్నాడు. సునీల్ కి 'మర్యాదరామన్న" పేరు తెచ్చింది తప్ప, రాజమౌళికి ఆశించిన రెస్పాన్స్ దక్కలేదు. తన ట్రెండ్ కి భిన్నంగా సినిమా తెరకెక్కించాడన్న కాంప్లిమెంట్స్ తప్ప. 'మర్యాదరామన్న" విషయంలో సునీల్ ఇమేజ్ పనిచేయడంతో, ఈసారి తన సోలో ఇమేజ్ తో 'ఈగ" సినిమాని సంచలనంగా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు రాజమౌళి.
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో 'ఈగ" సినిమాని తెరకెక్కిస్తున్న రాజమౌళి ఇప్పుడిప్పుడే 'ఈగ" గురించి టెన్షన్ పడ్తున్నాడు. 'అలా మొదలైంది" సినిమాతో నాని నటుడిగా ఓ మెట్టు పైకెక్కిన దరిమిలా, 'ఈగా" సినిమా విషయంలో క్రెడిట్ అతనికి వెళ్లిపోతుందన్నది రాజమౌళి టెన్షన్ కి కారణం. అందునా, సమంత గ్లామర్ కూడా 'ఈగ" సినిమా విషయంలో తనకు దెబ్బ కొడ్తుందేమోనని రాజమౌళి లోలోపల కుమిలిపోతున్నాడట.
అన్నిటికీ మించి, బడ్జెట్ ని హద్దుల్లో పెట్టుకోలేని రాజమౌళి 'ఈగ" బడ్జెట్ అంచనాలకు మించిపోతే, ఆ సినిమా సోసో విజయం సాధిస్తే ఎలాగని ఆందోళన చెందుతున్నాడు. పైకి మాత్రం, తాను 'ఈగ" కమర్షియల్ సక్సెస్ కోసం సినిమా తీయట్లేదనీ, టెక్నికల్ గా తెలుగు సినిమా స్థాయిని మరింత పెరిగేలా చేయడమే తన ఉద్దేశ్యమనీ, కొత్త ప్రయోగంగా 'ఈగ" గురించి అంతామాట్లాడుకునేలా సినిమా తీస్తున్నానని రాజమౌళి చెబుతుండడం గమనార్హం.


Click it and Unblock the Notifications











