twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళిని టెన్షన్ లో పడేస్తున్న రామ్ గోపాల్ వర్మ..!

    By Sindhu
    |

    తెలుగు దర్శకులలో ప్రేక్షకుల నాడి బాగా తెలిసిన దర్శకుడు రాజమౌళి. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో...నాని, సమంత కథానాయికలుగా 'ఈగ" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ గోపాలవర్మ అంటే జనాలకు గుర్తొచ్చే పదం కాంట్రవర్సి. జనాలను, మీడియాను బురిడి కొట్టించడంలో రామ్ గోపాలవర్మ సిద్ధిహస్తుడు.

    ఒక చిన్న సినిమాగా మొదలైన రాజమౌళి 'ఈగ', ఒక పెద్ద సినిమాగా తయారవుతుంది. 'ఈగ' అంటే ఏ శక్తులు లేని అతి చిన్న జీవి. కాని రాజమౌళి తన సినిమాకు ఆ పేరు పెట్టగానే, 'ఈగ' అంటే అతి పెద్ద శక్తిగా కనిపిస్తుంది. ఆ పేరు పెట్టి ఎక్సపెటేషన్స్ తగ్గిద్దాం అనుకున్న రాజమౌళికి వర్మ తన ట్వీట్స్ తో రాజమౌళిని టెన్షన్ లో పడేస్తున్నారట.

    కొందరు 'అవతార్' లాంటి అద్భుతాన్ని ఎక్సపేట్ చేస్తూ రాజమౌళికి నిద్ర లేకుండా చేస్తుంటే, మరో పక్క రామ్ గోపాలవర్మ మరో విధంగా ట్వీట్స్ ఇస్తున్నారు.

    వర్మ మెసేజ్ ల్లో ఎంత నిజం ఉందో కానీ 'ఈగ" గురించి తనదైన స్టైల్లో డౌట్ లేకుండా రాజమౌళి మగధీర కంటే 'ఈగ" బిగ్గర్ లాండ్ మార్క్ అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఈగ సినిమా ఫస్ట్ ట్రైలర్ బయటికి రాగానే ఈ సినిమా తప్ప మరే సినిమా కోసం నేను వేయిట్ చేయడం లేదు అన్న ఈ ట్వీట్స్ కి, రిప్లే మీరు టెన్షన్ పెట్టకండి సార్ అంటూ రాజమౌళి ట్వీట్స్ చేశారు.

    English summary
    Ram Gopal Varma commented on SS Rajamouli's Eega as 'Whens the first trailer of Eega coming out..I never waited for any film more than this'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X