చిరు శిబిరం వల్లే రాజమౌళి కి టెన్షన్?

రేపు సినిమా రిలీజయ్యాక అసభ్యంగా స్త్రీలను చూపారని కామెంట్స్ వస్తే చిరంజీవి కి చాలా ఇబ్బందులు వస్తాయని పార్టీ సీనియర్స్ సూచించారుట. దాంతో ముందే సెన్సార్ చేస్తే మేలని వారు భావించారని చెప్పుకుంటున్నారు. అలాగే రాజమౌళి ఇప్పటికే వారి సజెషన్స్ కి అణుగుణంగా స్క్రిప్టు మార్చాడనీ అయితే మరీ స్పైసీగా లేకపోతే భాక్సాఫీస్ దగ్గర ఇబ్భంది ఎదురౌతుందని దగ్గరవాళ్ళ తో ఆలోచనలు చేస్తున్నాడుట. మరి చిరు శిబిరం నిజంగా సజెస్టు చేసుంటే వారిది మంచి నిర్ణయమే...మరీ మాస్ అప్పీల్ పేరుతో ఆడవాళ్ళను వల్గారిటీగా చూపటం సమంజసం కాదని కొందరంటున్నారు.
ఇక ఈ సినిమా పునర్జన్మ అంశం ఆధారంగా రూపొందుతోంది. శ్రీహరి ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ జన్మలో చరణ్ ఫైట్ మాస్టర్ గా అలరిస్తాడు. అలాగే చిరంజీవి ఈ చిత్రంలో బంగారు కోడి పెట్ట పాటలో గెస్ట్ గా కనిపించనున్నాడు. అంతేగాక ఈ చిత్రంలో ఓ కత్తి ఫైట్ హైలట్ కానుందని తెలుస్తోంది. ఆ కత్తి ఫైట్ ఆధారంగా వీడియో గేమ్ మార్కెట్లో రాబోతోంది. ఇలా అన్ని జాగ్రత్తలూ కమర్షియల్ అప్పీల్ కోసం తీసుకుంటున్న రాజమౌళి టెన్షన్ తగ్గాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











