»   » ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్ తట్టుకుంటారా?

ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్ తట్టుకుంటారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. రాజమౌళి ‘బాహుబలి-2' తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఇది మంచి విషయమే గానీ, షాకింగ్ విషయం ఎలా అవుతుందనే గా మీ డౌట్.

ఇపుడు రాజమౌళి సాదా సీదా సినిమాలు తీయడం మానేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘బాహుబలి-2' లాంటి భారీ ప్రాజెక్టును తీస్తున్న రాజమౌళి.... దీని తర్వాత ‘గరుడ' అనే మరో భారీ ప్రాజెక్టు చేపట్టబోతున్నారట. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయాలని అనుకుంటున్నాడట రాజమౌళి.

Rajamouli to direct 'Garuda' Movie With NTR?

ఎన్టీఆర్ కూడా రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ సినిమా భారీ ప్రాజెక్టు కావడం, బాహుబలి సినిమాను మించిన బడ్జెట్ తో చేసే ఇంటర్నేషనల్ ప్రాజెక్టు కావడంతో దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ ఉంటుందని, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శారీరకంగా ప్రత్యేకంగా సన్నద్దం అవ్వాల్సి ఉంటుందని, రెండు మూడేళ్ల పాటు ఇతర సినిమాలు చేయకుండా కేవలం ఇదే ప్రాజెక్టుకు పరిమితం కావాలని చెప్పాడట రాజమౌళి. రాజమౌళిపై నమ్మకంతో ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేసిట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ కూడా గత రెండుమూడేళ్లుగా కేవలం ‘బాహుబలి' ప్రాజెక్టుకే పరిమితం అయిన సంగతి తెలిసిందే. మరో సంవత్సరం ఆయన ఇదే ప్రాజెక్టుకే పరిమితం కానున్నారు. బాహుబలి మొదటి భాగం భారీ విజయం ప్రభాస్ అభిమానులకు పూర్తి స్థాయిలో సంతృప్తి ఇచ్చినా..... తమ అభిమాన హీరో సినిమా కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయడాన్ని తట్టుకోలేక పోతున్నారు ఫ్యాన్స్.

Rajamouli to direct 'Garuda' Movie With NTR?

ఇపుడు ఎన్టీఆర్ కూడా అలాంటి నిర్ణయం తీసకునే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారనే విషయం చర్చనీయాంశం అయింది. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత? అనేది మాత్రం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది. ఒక వేళ గరుడ ప్రాజెక్టు ఎన్టీఆర్ తో చేస్తే... ఎన్టీఆర్ నేషల్ స్టార్ కావడం ఖాయం.

English summary
After the commercially hit film "Baahubali - The New Beginning", SS Rajamouli will reportedly direct another next magnum opus -- a Rs 1,000 crore project -- which has tentatively been titled "Garuda".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu