గబ్బర్‌సింగ్‌పై కన్నేసిన రాజమౌళి, శ్రీనువైట్ల, త్రివిక్రమ్!

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం ఆడియో భారీ విజయం సాధించిన నేపథ్యంలో సినిమా విడుదలపై కూడా అంచనాలు అమాంతం పెరిగి పోయాయి. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటు ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. గబ్బర్ సింగ్‌కు ఉన్న ఊపు చూస్తుంటే తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.

గబ్బర్ సింగ్ విడుదల తర్వత పవన్ మళ్లీ బిజీ అయిపోతాడు కాబట్టి వీలైనంత త్వరగా ఆయనతో సినిమాలకు కమిట్ కావాలని టాప్ డైరెక్టర్లు రాజమౌళి, శ్రీనువైట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు ప్రయత్నిస్తున్నారని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. వీరిలో త్రివిక్రమ్ ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో 'జల్సా' చేయించి తన కెర్లోనే అతిపెద్ద హిట్ కొట్టాడు.

పవన్ కళ్యాణ్‌తో సినిమా తీసి మరో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ నమోదు చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న రాజమౌళి, శ్రీను వైట్ల ఈ మేరకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరి ప్రయత్నం ఎక్కడి వరకు వచ్చిందో తెలియదు కానీ త్రివిక్రమ్ మాత్రం పవన్ కళ్యాణ్ తో జల్సా2 కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్...పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ చిత్రం ఫినిషింగ్ సమయంలో పవర్ స్టార్ తర్వాతి సినిమా ఏమిటనేదానిపై ఓ క్లారటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X