SSMB29కి రాజమౌళి సంచలన నిర్ణయం.. మహేశ్ లేకుండా ఆ టెక్నాలజీ.. ఇదే తొలిసారి!

RRR మూవీ ఇంటర్నేషనల్ స్థాయిలో సక్సెస్ కావడం, ఆస్కార్ అవార్డు గెలవడంతో అగ్ర దర్శకుడు రాజమౌళిపై కూడా చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న SSMB29 సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఇక దీనికోసం స్క్రిప్ట్ నుంచి విజువల్స్ వరకు చాలా గ్రాండ్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి పని చేయడం స్టార్ట్ చేసిన రాజమౌళి SSMB29లో మహేశ్ బాబు పాత్రను ఇతిహాసాలతో ముడిపెట్టడమే కాకుండా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారట.

Rajamouli Using Artificial Intelligence Technology For Mahesh Babu SSMB29

అలాంటి టాక్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెలుగు దర్శ దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న SSMB29 సినిమా కోసం జక్కన్న పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఇంతకు ముందు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత కె. విజయేంద్ర ప్రసాద్ మాటలను బట్టి మహేశ్ బాబుతో చేయబోయే మూవీ అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని ఒక టాక్ అయితే వినిపించిన విషయం తెలిసిందే.

Rajamouli Using Artificial Intelligence Technology For Mahesh Babu SSMB29

సీక్వెల్స్: SSMB29 మూవీని 2025 చివరి నాటికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కించేందుకు మూవీ కథను రెండు, మూడు భాగాలుగా చేయనున్నట్లు జక్కన్న ఆలోచిస్తున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్స్ ఉంటాయని, వీటిల్లో కథ మారుతుందని, ప్రధాన పాత్రలు మాత్రం అలాగే ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగా కథనాలు వచ్చాయి.

Rajamouli Using Artificial Intelligence Technology For Mahesh Babu SSMB29

మైథాలజీకి: అంతేకాకుండా SSMB29లో మహేశ్ బాబు పాత్రను హనుమంతుని నుంచి ప్రేరణ పొందినట్లుగా తెలుస్తోంది. ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ క్యారెక్టర్ కి హనుమంతునికి సమానమైన లక్షణాలు ఉంటాయని బాలీవుడ్, నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ మైథాలజీకి అత్యాధునిక సాంకేతను జోడించనున్నాడట రాజమౌళి.

Rajamouli Using Artificial Intelligence Technology For Mahesh Babu SSMB29

360 డిగ్రీస్ లో: SSMB29 కోసం జక్కన్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి 360 డిగ్రీస్ లో ఇమేజింగ్ చేసిన మహేశ్ బాబు సన్నివేశాలు షూట్ చేస్తారన సమాచారం. ఒకవిధంగా అవతార్ వంటి టెక్నిక్ అనుసరిస్తూ 360 డిగ్లీస్ లో ప్రతి యాంగిల్ లో మహేశ్ లుక్ కు సంబంధించి యానిమేషన్ తరహా ఇమేజింగ్ చేస్తారట.

రిస్కీ షాట్స్: అవసరమైన క్లోజప్పులు మహేశ్ పై, లాంగ్ షాట్స్ అడ్వెంచర్ సీన్స్, ఫైట్స్ అన్ని మోషన్ క్యాప్చర్ తో తీస్తారట. ఒకవేళ ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ వాడకం నిజమైతే SSMB29 కోసం మహేశ్ బాబు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి సినిమాలో హీరోలు ఎలాంటి రిస్కీ షాట్స్, ఎంతలా కష్టపడతారో తెలిసిందే.

Rajamouli Using Artificial Intelligence Technology For Mahesh Babu SSMB29

తొలి సినిమా: రాజమౌళి సినిమా అంటే ఎంతటి టాప్ హీరో అయినా ఒళ్లు హూనం కావాల్సిందే. RRR మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎలా కష్టపడ్డారో చూశాం. ఇక అడ్వెంచర్ మూవీ అంటే అంతకుమించి కష్టపడాల్సి ఉంటుంది. అందులోనూ రాజమౌళి క్రియేటివిటీ మాములుగా ఉండదు. కానీ ఈ ఏఐ ద్వారా మహేశ బాబుకు అలాంటి అవసరం రాదని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇండియన్ సినిమాలో ఏఐ వాడిన తొలి సినిమా SSMB29 అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X