జూ ఎన్టీఆర్ తో రిస్క్ చేయలేను రాజమౌళి, సైడైపోయిన వివి వినాయక్....

By Sindhu

'పాతాళ భైరవి" సినిమా గురించి జూ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చాలా రకాలుగా వ్యాఖ్యానించాడు. ఆ సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని జూ ఎన్టీఆర్, ఆ సినిమా కోసం దర్శకుడిగా రాజమౌళి, వివి వినాయక్ పేర్లను చాలా సార్లు విన్పించాడు. అయితే, ఈ మధ్య జూ ఎన్టీఆర్ ఎక్కడా 'పాతాళభైరవి" సినిమా గురించి మాట్లాడ్డంలేదు. అటు వివి వినాయక్, రాజమౌళి సైతం, 'పాతాళ భైరవి" ప్రస్తావన ఎక్కడి తీసుకురాకుండా జాగ్రత్తపడ్తున్నారు.

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలు సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతోనే ఇటు జూ ఎన్టీఆర్, అటు రాజమౌళి ఇంకోపక్క వివి వినాయక్..ఈ ముగ్గురూ 'పాతాళ భైరవి" సినిమా విషయంలో సైలెంట్ గా వున్నట్టు సమాచారం. ఇదిలా వుంటే, ఈ ఏడాదిలోనే జూ ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో 'పాతాళ భైరవి" సెట్స్ మీదకు వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. రాజమౌళి మాత్రం ప్రస్తుతానికైతే రిస్క్ చేయలేమని, కొద్ది నెలలు ఆగితే, పరిస్థితి కొలిక్కి వస్తుందనీ, అప్పుడు ఆ ప్రాజెక్ట్ విషయమై ఆలోచిద్దామని, జూ ఎన్టీఆర్ బుజ్జగించినట్టు తెలుస్తోంది. అలనాటి మేటి చిత్రాలపై కొత్త తరం హీరోలు మోజు చూపుతున్న దరిమిలా, ముందు ముందు ఆ సినిమాలు మెరుగులు దిద్దుకుంటాయనీ, కొత్త తరం, ప్రేక్షకుల్ని రంజింపజేస్తాయనీ ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X