ఆవిడే కావాలి, అవసరమైతే రెమ్యూనరేషన్ పెంచుదాం... టీంకు రాజమౌళి ఆదేశాలు?
Recommended Video

బాహుబలి, బాహుబలి 2 తర్వాత రాజమౌళి నుంచి రాబోయే సినిమాపై కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు జక్కన్న.
రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళి ప్రతి అంశాన్ని చాలా కీలంగా తీసుకుంటున్నారు. హీరోయిన్ల ఎంపిక ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా తాను అనుకున్న వారి డేట్స్ దొరక్క పోవడంతో వెయిట్ చేయాల్సి వస్తోంది. సినిమాలోని పాత్రకు పెర్ఫెక్టుగా సూటయ్యే బ్యూటీస్ కోసం రాజమౌళి ఎదురు చూస్తున్నాడు.

మొత్తం ముగ్గురు హీరోయిన్లు
‘ఆర్ఆర్ఆర్' కథ ప్రకారం ఈ చిత్రంలో మొత్తం ముగ్గురు హీరోయిన్ల అవసరం ఉంది. ఇప్పటి వరకు పూర్తయిన 3 షెడ్యూల్స్ హీరోయిన్లు లేకుండానే కంప్లీట్ చేశారు. అయితే త్వరలో ప్రారంభం కాబోయే కోల్‌కతా షెడ్యూల్‌లో మాత్రం ఇద్దరు హీరోయిన్లు అవసరం ఉందట. మరో హీరోయిన్ ఎంపిక తర్వాత జరుగుతుందని టాక్.

అలియా భట్ కోసం రాజమౌళి ప్రయత్నాలు
రాజి, ఉడ్తా పంజాబ్, గల్లీ బాయ్ చిత్రాల్లో అలియా భట్ పెర్ఫార్మెన్స్ చూసి ముగ్దుడైపోయిన రాజమౌళి... తన సినిమాలో మెయిన్ లీడ్‌గా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఆమెను సంప్రదించినప్పటికీ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోయింది.

ఆవిడే కావాలి, అవసరమైతే రెమ్యూనరేషన్ పెంచుదాం...
మరోసారి రాజమౌళి తన టీంను అలియా భట్‌తో సంప్రదింపులు జరుపాలని పురమాయించినట్లు తెలుస్తోంది. అవసరం అయితే రెమ్యూనరేషన్ పెంచుదాం, నేను అనుకున్న పాత్రకు ఆవిడే కావాలంటూ బీష్మించుకుని కూర్చున్నాడట.

రాజమౌళి ప్రయత్నాలు ఫలించేనా?
ప్రస్తుతం అలియా భట్ తన ప్రియుడు రణబీర్ కపూర్‌తో కలిసి ‘బ్రహ్మాస్త్ర' అనే చిత్రంలో నటిస్తోంది. మరి రాజమౌళి ప్రయత్నాలు ఫలిస్తాయా? ‘ఆర్ఆర్ఆర్' సినిమాలో ఆమెను హీరోయిన్‌గా చూస్తామా? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











