»   » సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి?

సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గతంలో జరిగిన పోరపాటు ...పొరపాటున కూడా మళ్లీ జరగకుండా ఉండేందుకు రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. అందుకు గాను ఆన్ని జాగ్రత్తులు తీసుకుంటున్నారు. ఎవర ఏమనుకున్నా ఫరవాలేదని టీమ్ ని హెచ్చరిస్తున్నారు.

ఇదంతా దేనికి అంటే బాహుబలి - ది బిగనింగ్ లో జరిగిన లీకేజ్ గురించి. ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. రీసెంట్ గా సినిమా ప్రారంభానికి ముందే టీమ్ ను కూర్చోబెట్టి.. ఓ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా సమాచారం. అందులో భాగంగానే మెబైల్ ఫోన్ వాడకుండా నిషేదం పెట్టినట్లు సమాచారం. అలాగే కీరవాణీ పాటలు కూడా ఆడియో విడుదలకు ముందుగానే బయటకు వచ్చిన నేపద్యంలో ఆ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Rajamouli warning to Bahubali -2 team

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి: ది కన్‌క్లూజన్‌ షూటింగ్‌ గురువారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది. ప్రభాస్, రమ్యకృష్ణ మీద వచ్చే సన్నివేశాలతో ఈ షూటింగ్ ప్రారంభమైంది. రెగ్యులర్ గా ఈ షూటింగ్ ఎటువంటి బ్రేక్ లేకుండా జరగనుంది. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం సెట్స్ వేస్తూండటం, స్క్రిప్టుపై కసరత్తులతో టీమ్ గడపింది.

ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. జులై 10న విడుదలైన బాహుబలి: ది బిగినింగ్‌ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.

English summary
Strict instructions have been given by Rajamouli to every cast and crew member of Baahubali-2 to avoid leaks.
Please Wait while comments are loading...