రాజమౌళి దర్సకత్వంలో బాలకృష్ణ చిత్రం!?
ఎమోషన్, యాక్షన్ చిత్రాలను తనదైన శైలిలో పండించే దర్సకుడు రాజమౌళి.అలాగే నటుడుగా బాలకృష్ణ కూడా ఎమోషన్స్ కి యాక్షన్ మిక్స్ చేసి చేసిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యీయి.దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందితే ఎలా ఉంటుందనే ఆలోచన చాలా మందికి ఉంది.అయితే ఈ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావటానికి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నడుం కట్టారని సమాచారం.ఈ కాంబినేషన్ లో చిత్రం చేయటానికి నిర్మాతలు రాజమౌళిని కలసి చర్చిస్తున్నారని తెలుస్తోంది.
రాజమౌళి ఓకే అంటే బాలకృష్ణ డేట్స్ సమస్య కాదనేది వారి ఆలోచన.వీరిద్దరి కలయకలలో మరో సమరసింహా రెడ్డి,నరసింహనాయుడు తరహా చిత్రం వస్తుందని వారు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.అయితే రాజమౌళి ఇప్పటివరకూ యస్ గానీ,నో గానీ చెప్పకుండా అలోచిస్తానని,తనకి ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ తర్వాత చూద్దామని అన్నట్లు తెలుస్తోంది.అన్ని అనుకూలిస్తే 2012 చివరలో ఈ చిత్రానికి సంభందించిన ప్రకటన వస్తుంది.ఇక ఈ నిర్మాతలు ఇప్పుడు మహేష్ తో దూకుడు చిత్రం చేస్తున్నారు.ఇంతకుముందు వెంకటేష్ తో నమో వెంకటేశ చిత్రం, మనోజ్ తో బిందాస్,అల్లరి నరేష్ తో అహనా పెళ్ళంట సినిమాలు చేసారు.


Click it and Unblock the Notifications











