For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rajamouli's RRR : మళ్ళీ మారిన రిలీజ్ డేట్.. అది కూడా కలిసొచ్చేలా జక్కన్న ప్లాన్ .. త్వరలో ప్రకటన!

  |

  దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఐదు భారతీయ భాషలలోనే కాక మరో ఐదు విదేశీ బాషలలో కూడా రిలీజ్ అవుతోంది. అయితే రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొనగా ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ తెరమీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  తెలుగు సినిమా కాదిది

  తెలుగు సినిమా కాదిది

  తెలుగు సినిమా సత్తాను కేవలం భారతదేశానికి మాత్రమే కాక ప్ర‌పంచానికి తెలియ‌జెప్పిన బాహుబలి తరువాత రాజమౌళి రేంజ్ మారిపోయింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.2400 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించి ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకి అప్పట్లో బద్దలు కొత్త లేని రికార్డుగా నిలిచింది. అంతే కాక పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అయి తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పి తెలుగు వాడు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించింది.

  రౌద్రం ర‌ణం రుధిరం

  రౌద్రం ర‌ణం రుధిరం

  బాహుబలి క్రేజ్ తో పాటు హాలీవుడ్ మొదలు బాలీవుడ్ దాకా అనేక మంది నటీనటులు కూడా ఉండడంతో ఈ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అన్ని బాషల ప్రేక్షకులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే రాజ‌మౌళి టాలీవుడ్ టాప్‌ హీరోలయిన ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో అన్ని బాషల నటులను మొహరించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

  లెక్క ప్రకారం

  లెక్క ప్రకారం

  అక్టోబ‌ర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'ను విడుద‌ల చేస్తామని ఈ మధ్య ఎన్టీఆర్ పుట్టినరోజున రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా పేర్కొన్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ దాటికి షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో సినిమా అక్టోబర్ నెల 13వ తేదీన రిలీజ్ కావడం అనేది దాదాపు అసాధ్యం అని అంటున్నారు.

  కొత్త రిలీజ్ డేట్

  కొత్త రిలీజ్ డేట్

  ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం ఒక కొత్త రిలీజ్ డేట్ రాజమౌళి ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు 73వ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 2022 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లాంటి స్వాతంత్ర సమరయోధుల జీవిత కథల నేపథ్యంలో తెరకెక్కుతుండంతో రిపబ్లిక్ డే అనేది సరిగ్గా సూటవుతుందని కూడా రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం..

  Krack సక్సెస్ జోష్ లో Ravi Teja | Khiladi First Glimpse On Republic Day | Filmibeat Telugu
  ఆప్పుడే ప్రకటన

  ఆప్పుడే ప్రకటన

  అంతేకాక ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15వ తేదీన ఒక స్పెషల్ టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అప్పుడే సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి కొత్త ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించారు.

  English summary
  As we all know Roudram Ranam Rudhiram (RRR) will be missing its previously announced release date, which is on October 13, 2021.as per reports makers are planning to release the film on January 26th, coinciding with the 73rd Republic day of India.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X