ఒకప్పుటి స్టార్ ‘రజని’ మళ్ళీ తెర పైకి
కొంతకాలం అగ్ర నాయికలుగా పేరు పొంది తర్వాత పెళ్లిళ్లు చేసుకుని చిత్ర పరిశ్రమకు దూరమై ఆ తర్వాత బుల్లితెరకు పరిచయమవుతున్నారు సో దీన్ని బట్టి నటన పట్ల వీరికున్న అభిమానం ఈ విధంగా చాటు కోవడం తరచుగా మనం చూస్తూనే వుంటాం. ఆ మధ్య రాధిక, మీనా, సిమ్రాన్, రమ్యకృష్ణ పెళ్లిళ్ల అనంతరం ఇలా వచ్చినవారే. ఇప్పుడు తాజాగా నాటి 'మురళీకృష్ణుడు", 'మజ్ను' కథానాయిక అదేనండి నాగార్జున తో సూపర్ హిట్ ఇచ్చిన చిత్రంలోని రజని, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖ హీరోలతో పలు చిత్రాలలో కథానాయికగా నటించిన రజని. ఫిల్మీడియా క్రియేషన్స్ నిర్మిస్తున్న 'డా.ఇందిర" సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ధారావాహిక కు పి.ఛంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ'సెంటిమెంట్ కమర్షియల్ సీరియల్స్ వస్తున్న ఈ సమయంలో ప్రజారోగ్యమే పరమావధిగా ఈ సీరియల్ రూపొందుతోంది. ఈ పాత్ర నాకు సంతృప్తి నిచ్చింది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలు, పర్యావరణం, వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు ఎటువంటి చికిత్స పొందాలి అనే అంశాలు ఇందులో వివరిస్తున్నాం అన్నారు.


Click it and Unblock the Notifications











